iDreamPost

తాను ఓపెన్ చేసిన జైలు బ్లాక్ లో.. రిమాండ్ ఖైదీగా చంద్రబాబు!

తాను ఓపెన్ చేసిన జైలు బ్లాక్ లో.. రిమాండ్ ఖైదీగా చంద్రబాబు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు బెయిల్ తీసుకొచ్చేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే చంద్రబాబుకు బెయిల్ రావడం కష్టమని.. పదేళ్లు జైలు జీవితం గడపడం ఖాయమని వైసీపీ నేతలు కుండబద్దలు కొట్టి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరో వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఇప్పుడు చంద్రబాబు రిమాండు ఖైదీగా ఉన్న బ్లాకును ఆయనే ప్రారంభించారంటూ చెబుతున్నారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు ప్రత్యేక గది, మెడిసిన్, ఆహారం అందించేందుకు ఒక సహాయకుడిని కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి ఆయనను కలవనున్నారు. అంతేకాకుండా చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతి కూడా ఇచ్చారు. రిమాండు ఖైదీగా ఉన్న చంద్రబాబు చెప్పబోయే సమాధానాలు ఈ కేసులో మరింత కీలకంగా మారనున్నాయని అధికారులు చెబుతున్నారు.

చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంచడంపై ఒక వార్త బాగా వైరల్ అవుతోంది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటున్న బ్లాకుకు.. చంద్రబాబుకు ఒక అనుబంధం ఉంది అంటూ చెబుతున్నారు. అదేంటంటే.. ప్రస్తుతం ఆయన ఉంటున్న బ్లాకును చంద్రబాబే స్వయంగా 2015లో ప్రారంభించారంట. ఆయన ప్రారంభించిన బ్లాకులోనే చంద్రబాబు రిమాండు ఖైదీగా ఉన్నారని చెబుతున్నారు. ఇంక ఈ కేసుకు సంబంధించిన వివరాలు చూస్తే.. చంద్రబాబుకు బెయిల్ తీసుకొచ్చేందుకు ఆయన తరఫు లాయర్లు తీవ్రంగా కృషి చేస్తున్నారు. విజయవాడ ఏసీపీ కోర్టులో ఆయనను ప్రొడ్యూస్ చేశారు కాబట్టి.. అక్కడే బెయిల్ పిటిషన్ దాఖలు చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ ఎలాంటి తీర్పు వస్తుందో అనే అనుమానంతో.. సుప్రీంకోర్డులో కూడా లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు లాయర్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: చంద్రబాబు అరెస్ట్ తో రామోజీలో భయం! నెక్స్ట్ ఏంటి?

ఇదీ చదవండి: చంద్రబాబు అరెస్ట్‌.. థాంక్యూ జగన్‌.. నా ఆత్మకు శాంతి చేకూర్చావ్‌ అంటూ ఫ్లెక్సీలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి