iDreamPost

చంద్రబాబు అరెస్ట్ తో రామోజీలో భయం! నెక్స్ట్ ఏంటి?

చంద్రబాబు అరెస్ట్ తో రామోజీలో భయం! నెక్స్ట్ ఏంటి?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. శనివారం ఉదయం నంద్యాలలో ఆయను అరెస్ట్ చేసింది మొదలు.. ఆదివారం రాత్రి 7 గంటలకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించే వరకు అందరిలో ఒకటే ఉత్కంఠ. చంద్రబాబు.. తన 48 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటన ఎప్పుడు ఎదుర్కొలేదు. ఇక ఆదివారం విజయవాడలోని ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ ను విధించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించారు. ఇక చంద్రబాబు అరెస్ట్ తో రామోజీ రావులో కూడా భయం పట్టుకుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకు తగినట్లే ఆయన పత్రిక చేసిన కొన్ని పనులు బలాన్ని చేకూర్చుతున్నాయి.

ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు  సీఎంగా ఉన్నప్పుడు చేసిన స్కిల్ డెవల్మెంట్ స్కాంలో సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అలానే  విజయవాడలోని ఏసీబీ కోర్టుకు కూడా  చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో రామోజీ రావు కూడా భయపడుతున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  చంద్రబాబును అరెస్ట్ చేసి… తీసుకెళ్తున సమయంలో.. ఆశించిన మేర టీడీపీ కార్యకర్తలు ఎవరూ రోడ్లపైకి రాకపోవడంతో ఆయనకు నిరాశ కలిగించి ఉండొచ్చని కొందరు అభిప్రాయ పడుతున్నారు.

అంతేకాక  చంద్రబాబుకు ఏదో జరిగిపోయినట్లు పిక్చర్ ఇవ్వడానికి ఆయన మీడియా నానా పాట్లు పడింది. గతంలో జగన్ కేసులో సీబీఐ ఏ రకంగా కేసును టేకాప్  చేసింది.. ఎన్ని విన్యాసాలు చేసిందో అందరికి తెలిసిందే. అయితే నేడు చంద్రబాబు కేసులో సీఐడీ అనేక ఆధారాలు చూపిస్తున్నా రామోజీకి మాత్రం సరిపోవడం లేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు రామోజీరావుకు సంబంధించిన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై అధికారులు దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ కేసులో భాగంగా ఇప్పటికే ఒకసారి రామోజీ రావును ఏపీ సీఐడీ అధికారులు విచారించారు. ఆ సమయంలో ఆయన బెడ్ పై ఉండి అధికారులకు సహకరించినట్లు ఉండే దృశ్యాలు బయటకు వచ్చాయి. అప్పుడే ఆయనపై అనేక అభిప్రాయాలు వచ్చాయి. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ తో రామోజీ రావులో కూడా ఓ తెలియని భయం పట్టుకుందని, అందుకే తన మీడియా రాతల్లో మార్పులు వచ్చాయని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మరి.. వీరి మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి