Arjun Suravaram
ఓ టెక్ సంస్థ సీఈఓ తన వద్ద సెక్రెటరీగా పనిచేసిన మహిళతో దారుణంగా ప్రవర్తించాడు. సదరు మహిళతో ఆ సీఈఓ ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం ఆమెతో అత్యంత దారుణంగా వ్యవహరించాడు.ఈ ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ టెక్ సంస్థ సీఈఓ తన వద్ద సెక్రెటరీగా పనిచేసిన మహిళతో దారుణంగా ప్రవర్తించాడు. సదరు మహిళతో ఆ సీఈఓ ఒక ఒప్పందం చేసుకున్నాడు. దాని ప్రకారం ఆమెతో అత్యంత దారుణంగా వ్యవహరించాడు.ఈ ఘోరమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Arjun Suravaram
నేటికాలంలో మహిళాలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. ఇంకా మగవారిని మించి కొన్ని రంగాల్లో తమ సత్తా చాటుకుంటున్నారు. అయితే ఇలా అభివృద్ధి చెందుతోన్న సమాజంలో మహిళలు ఎంతో రాణిస్తున్నా..వారికి వేధింపులు మాత్రం తగ్గలేదు. ఇంట్లో, ఆఫీసులు, ఇతర ప్రాంతాల్లో ఆడవారు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మహిళల బలహీనతలను ఆసరాగా చేసుకుని కొందరు పశువులు లైంగిక వేధింపులకు గురి చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే ఓ టెక్ సంస్థ సీఈవో చేసిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చింది. సదరు సీఈఓ తన వద్ద సెక్రెటరీగా పనిచేసిన మహిళను బానిస మాదిరిగా ఉండాలని అందుకోసం ఏకంగా ఓ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
అమెరికాకు చెందిన ఓ టెక్ సంస్థ సీఈవో తన మాజీ సెక్రటరీని సె*క్స్ బానిసగా చేసి.. చిత్ర హింసలకు గురి చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూఎస్ఏ లోని శాన్-ఫ్రాన్సిస్కో సంస్థ ట్రేడ్ షిప్ సహ వ్యవస్థాపకుడు క్రిస్టియన్ లాంగ్ ఈ దారుణ ఘటనకు పాల్పడ్డాడు. తన వద్ద పని చేసే జేన్ డో అనే మహిళా ఉద్యోగిని శృంగార బానిసగా చేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. మహిళ ఉద్యోగంలో చేరిన తొలి రోజే ఓ ఒప్పందంపై సంతకం చేయించారు. బానిస ఒప్పందంపై బలవంతంగా సంతకం చేయించారని బాధితురాలు వ్యాజ్యం దాఖలు చేసింది. జేన్ డో.. క్రిష్టియన్ లాంగ్ తనపై చాలా ఏళ్ల పాటు అత్యాచారానికి పాల్పడ్డారని, అంతేకాక తన పట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించాడని ఆరోపించింది. ఆమె దాఖలు చేసిన వ్యాజ్యంలో ఆ కంపెనీపై కూడా ఆరోపణలు చేసింది.
ఇంకా ఆమె.. తనకు జరిగిన అనేక ఇబ్బందుల గురించి తెలియజేసింది. భౌతికంగా హింసించడం, యూరిన్ విసర్జన చేయడం, వివిధ వస్తువులను ప్రైవేటు భాగాల్లోకి చొప్పించడం సహా అత్యంత క్రూరమైన చర్యలకు లాంగ్ పాల్పడినట్లు ఆమె పేర్కొంది. అదే విధంగా ఈ ఏడాది ప్రారంభంలో సీఈఓగా లాంగ్ ను తొలగించారు. ఆ తర్వాతే ఈ ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అతడిపై లైంగిక ఆరోపణలు రావడంతో యాజమాన్యం ఉద్వాసన పలికింది. అలానే తనకు జరిగిన అన్యాయంపై హెచ్ఆర్ కు ఫిర్యాదు చేయగా.. ఆమెను 2020లో ఉద్యోగం నుంచి తొలగించారు.
ఇక ఆమె సమర్పించిన ఒప్పంద పత్రం ప్రకారం.. ‘తన ఓనర్ కి సె*క్స్ అవసరమైనప్పుడు అతని కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. ఏ సందర్భంలోనూ అతడితో ఏ పనికైనా నిరాకరించకూడదు. ఒప్పందం ప్రకారం యజమాని విధించిన శిక్షను బానిస స్వీకరించాలి. అతడి పట్ల కోపం, నిరుత్సాహం, విసుగు ప్రదర్శించకూడదు” అని అందులో పేర్కొంది. అయితే అతడి వికృత ప్రవర్తన గురించి ఆలస్యంగా బయటపడింది. బాధితురాలు ఫిర్యాదుతో ఆ సీఈఓ బాగోతం వెలుగులోకి వచ్చింది. మరి.. ఈ ఘోరానికి పాల్పడిన సదరు వ్యక్తికి ఎలాంటి శిక్ష విధించాలి. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.