iDreamPost

OTTలో కొత్త ట్రెండ్ – మల్టీపుల్ స్ట్రీమింగ్ పార్టనర్స్

  • Published Mar 26, 2024 | 2:28 PMUpdated Mar 26, 2024 | 2:31 PM

OTT: పాన్ ఇండియా సినిమాలు హిందీ వెర్షన్ హక్కులు మాత్రం ఒక సెపరేట్ ప్లాట్ ఫారమ్ కు ఇచ్చి మిగతా అన్ని వెర్షన్స్ మరో ప్లాట్ ఫారమ్ కు ఇవ్వడం ఈ మధ్య కొత్త అనవాయితీగా మారింది.

OTT: పాన్ ఇండియా సినిమాలు హిందీ వెర్షన్ హక్కులు మాత్రం ఒక సెపరేట్ ప్లాట్ ఫారమ్ కు ఇచ్చి మిగతా అన్ని వెర్షన్స్ మరో ప్లాట్ ఫారమ్ కు ఇవ్వడం ఈ మధ్య కొత్త అనవాయితీగా మారింది.

  • Published Mar 26, 2024 | 2:28 PMUpdated Mar 26, 2024 | 2:31 PM
OTTలో కొత్త ట్రెండ్ – మల్టీపుల్ స్ట్రీమింగ్ పార్టనర్స్

గత కొన్నేళ్లలో ఓటీటీ మార్కెట్ లో చాలా మార్పులు వచ్చాయి. కరోనా దాడి తరువాత ఒక్కసారిగా క్రేజ్ తెచ్చుకున్న ఓటీటీ యాప్ లు వెలుగులోకి వచ్చాయి. అయితే ఎంత తొందరగా పైకి వచ్చాయో అంతే తొందరగా పడిపోయే ప్రమాదంలో కూడా పడ్డాయి. అందుకే స్లంప్ లో ఉన్న ఓటీటీ బిజినెస్ ను మళ్ళీ ట్రాక్ లోకి తేవడానికి కొత్త ట్రెండ్ మొదలుపెట్టారు. అదే ఒక సినిమాకి మల్టీపుల్ స్ట్రీమింగ్ పార్టనర్స్ అనే ట్రెండ్. కాగా ఈ ట్రెండ్ ను పాన్ ఇండియా సినిమాలతో మొదలు పెట్టారు.

పాన్ ఇండియా సినిమాలు హిందీ వెర్షన్ హక్కులు మాత్రం ఒక సెపరేట్ ప్లాట్ ఫారమ్ కు ఇచ్చి మిగతా అన్ని వెర్షన్స్ మరో ప్లాట్ ఫారమ్ కు ఇవ్వడం ఈ మధ్య కొత్త అనవాయితీగా మారింది. సలార్ సినిమా హిందీ వెర్షన్ హక్కులను డిస్నీప్లస్‌ హాట్ స్టార్ ప్లాట్ ఫారమ్ కు ఇవ్వగా మిగతా వెర్షన్ల హక్కులు నెట్ ఫ్లిక్స్ కి దక్కాయి. ఒక లేటెస్ట్ బ్లాక్ బస్టర్ హనుమాన్ ఒక అడుగు ముందుకేసి ఏకంగా మూడు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లతో డీల్ సెట్ చేసుకుంది. హనుమాన్ తెలుగు వెర్షన్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతుండగా… హిందీ వెర్షన్ జియో సినిమా యాప్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కాగా హనుమాన్ తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్లు ఏప్రిల్ 5 నుంచి డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వస్తాయని ఈరోజు ఉదయం దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రకటించారు.

ఇక పై వచ్చే భారీ పాన్ ఇండియా సినిమాలు కూడా ఇదే దారిన పోయే అవకాశాలు ఉన్నాయని గట్టి టాక్ వినిపిస్తుంది. ఆ రకంగా చూసుకుంటే డిజిటల్ బిజినెస్ సజావుగా సాగడానికి పాన్-ఇండియన్ సినిమాల నిర్మాతలు తమ వ్యూహాన్ని మార్చుకున్నారని కనిపిస్తుంది. తమ సినిమాకు రెండు స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను లాక్ చేయాలని వారు చూస్తున్నారు. ఇక ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కూడా ఒకప్పటి లాగా కేవలం పెద్ద సినిమా అన్న క్రేజ్ చూసి భారీ మొత్తాలను అందించడానికి ఆసక్తి చూపడం లేదు. ఆ సినిమా పాన్-ఇండియా స్థాయిలో విడుదలయ్యే సినిమా అయినా వారు దానిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. చాలా సినిమాల టీమ్‌లు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల నుండి 100, 200 కోట్లకు పైగా భారీ మొత్తాలను ఆశిస్తున్నాయి.

ఒక దశలో సినిమా నష్టాలను తక్కువ చేసుకునేందుకు ఓటీటీ డీల్స్ సహాయపడ్డాయి. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ఎంత అడిగితే అంత ఇవ్వడానికి ఓటీటీ సంస్థలు సిద్దంగా లేవు. లక్కీగా కొన్ని సినిమాలకు విడుదల తర్వాత ఓటీటీ డీల్ జరుగుతుంది. హనుమాన్ సినిమా డిజిటల్ బిజినెస్ అందుకే మంచి ధరకు కుదిరింది. అలాగని అన్ని సినిమాలకు అలా జరగడం కష్టమే కదా. అందుకే సినిమా ఫస్ట్ లుక్, టీజర్ దగ్గర నుంచీ ప్రేక్షకులతో పాటు ఓటీటీ టీమ్స్ ను కూడా ఆకట్టుకునేందుకు నిర్మాతలు చూస్తున్నారు. మరి ఓటీటీ బిజినెస్ కోసమైనా తెలుగు నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలు కంటెంట్ మరింత స్ట్రాంగ్ గా ఉండేలా చూసుకుని మల్టీపుల్ స్ట్రీమింగ్ పార్టనర్స్ ట్రెండ్ తో లాభాలను ఆర్జించాలని ఆశిద్దాం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి