iDreamPost
android-app
ios-app

OTT New Series: కొరియన్ వెబ్ సిరీస్ లు ఇష్టమా! OTTలోకి వచ్చేసిన ది బెస్ట్ K డ్రామా!

  • Published Jun 07, 2024 | 6:17 PMUpdated Jun 07, 2024 | 6:17 PM

భాష బేధం లేకుండా ఏ భాషలో ఉండే సినిమాలనైనా సరే.. ప్రేక్షకులు ఆదరిస్తున్న సంగతి తెలిసిందే, కేవలం కథను బట్టే సినిమాలను చూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు కొరియన్ కథలను కూడా బాగానే చూసేస్తున్నారు. ఈ క్రమంలో మరో కొరియన్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

కొరియన్ సినిమాలు, సిరీస్ లలో ఏ మ్యాజిక్ ఉందొ తెలియదు కానీ.. చాలా మంది ఈ మధ్య కాలంలో వీటిని ఎక్కువగా చూసేందుకు ఇష్టపడుతున్నారు. పైగా కొన్ని వెబ్ సిరీస్ లు తెలుగులో కూడా ఉండడంతో కొరియన్ కథలకు ఇంకాస్త ఆదరణ బాగా పెరిగిపోయింది. ఇప్పటివరకు ఓటీటీ లలో ఎన్నో కొరియన్ వెబ్ సిరీస్ లు, సినిమాలు ప్రేక్షకులను మెప్పించాయి. అవి తెలుగులో లేకపోయినా సరే సబ్ టైటిల్స్ పెట్టుకుని మరి చూసేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరొక ఇంట్రెస్టింగ్ కొరియన్ వెబ్ సిరీస్ యాడ్ అయిపొయింది. మరి ఆ వెబ్ సిరీస్ ఏంటో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఇప్పుడు వెబ్ సిరీస్ లంటే అందరూ ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. పైగా ఏదైనా ఓ వెబ్ సిరీస్ బాగా హిట్ అయిందంటే.. వెంటనే దానికి అనేక సీజన్స్ వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు ఓటీటీ లోకి సరికొత్త కొరియన్ వెబ్ సిరీస్ వచ్చేసింది. ఈ సిరీస్ పేరు “హైరార్కీ”. ఈ సిరీస్ మొదటి సీజన్ ప్రస్తుతం.. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ప్రస్తుతానికైతే ఈ సిరీస్ ఇంగ్లీష్, హిందీ, తమిళంలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికైతే ఈ సిరీస్ తెలుగులో లేదు. కానీ, పెరుగుతున్న ఆదరణను బట్టి తెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.

ఇక ఈ సిరీస్ కథ విషయానికొస్తే.. కామన్ గా కొరియన్ కథలలో అందరు ఇష్టపడేది లవ్ యాంగిల్ నే.. దాదాపు అన్ని స్టోరీ ప్లాట్స్ ఒకటే అయినా కానీ.. వారు ప్రేమ కథలను చూపించే తీరు మాత్రం.. అందరిని మెప్పించేస్తుంది. ఈ సిరీస్ కాస్త డిఫరెంట్.. ఈ సిరీస్ కథ అంతా కూడా కొంతమంది స్కూల్ స్టూడెంట్స్ చుట్టూ కొనసాగుతుంది. కొంతమంది టాప్ ర్యాంక్ విద్యార్థులు తమ స్కూల్ లోని లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయాలనీ అనుకుంటూ ఉంటారు. కానీ సరిగ్గా అదే సమయానికి ఆ స్కూల్ లో ఓ సీక్రెట్ గా మరో స్టూడెంట్ జాయిన్ అయ్యి.. ఆ ప్లాన్ ను రివర్స్ చేస్తుంది. అసలు ఆ స్టూడెంట్స్ ఎందుకు అలా చేయాలనుకుంటారు ! వాళ్ళ ప్లాన్ ఏంటి ! ఇవన్నీ తెలియాలంటే ఈ సిరీస్ ను చూడాల్సిందే. మరి ఈ వీకెండ్ మీ వాచ్ లిస్ట్ లోకి ఈ సిరీస్ ను కూడా యాడ్ చేసేసుకోండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి