iDreamPost

Netflix లో టాప్ 10 ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమాలు/ సిరీస్ లు ఇవే !

  • Published Jun 17, 2024 | 1:30 PMUpdated Jun 17, 2024 | 1:30 PM

Netflix Top 10 Trending Movies: ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు సిరీస్ లు రిలీజ్ అవ్వడమే కాకుండా.. రిలీజ్ అయినా సినిమాలలో ఏ సినిమాలు టాప్ 10 లో ఉన్నాయో కూడా లిస్ట్ వచ్చేస్తుంది. మరి ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాల జాబితా ఇలా ఉంది.

Netflix Top 10 Trending Movies: ప్రతి వారం ఓటీటీ లో చాలానే సినిమాలు సిరీస్ లు రిలీజ్ అవ్వడమే కాకుండా.. రిలీజ్ అయినా సినిమాలలో ఏ సినిమాలు టాప్ 10 లో ఉన్నాయో కూడా లిస్ట్ వచ్చేస్తుంది. మరి ఈ క్రమంలో నెట్ ఫ్లిక్స్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఉన్న సినిమాల జాబితా ఇలా ఉంది.

  • Published Jun 17, 2024 | 1:30 PMUpdated Jun 17, 2024 | 1:30 PM
Netflix లో టాప్ 10 ట్రెండింగ్ లో దూసుకుపోతున్న సినిమాలు/ సిరీస్ లు ఇవే !

ఇప్పుడు ఎవరి దగ్గర విన్న కూడా వినిపించే పేరు ఓటీటీ.. వీకెండ్ వస్తుందంటే చాలు. . ఏ సినిమాలు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ రెడీ చేసేసుకుంటారు. ఇక మూవీ లవర్స్ ఇంట్రెస్ట్ కు తగినట్టు గానే.. ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ కూడా మంచి మంచి కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. ఈ క్రమంలో సాధారణంగా బయట ఎవరైనా ఈ వీకెండ్ ప్లాన్స్ ఏంటి అని అడిగితే నెట్ ఫ్లిక్స్ అండ్ చిల్ అనే మాట వినే ఉంటారు. మరి ఈ క్రమంలో అదే నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయ్యి.. టాప్ 10 ట్రెండింగ్ లో కొనసాగుతున్న ఈ సినిమాలను మీరు చూశారో లేదో ఓ లుక్ వేసేయండి.

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ .. ప్రతి వారం మంచి కంటెంట్ తో ఎన్నో సినిమాలను, సిరీస్ లను రిలీజ్ చేస్తుంది. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కు సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారనే చెప్పి తీరాలి. ప్రతి వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలను, సిరీస్ లను రిలీజ్ చేయడమే కాకుండా.. రిలీజ్ అయినా సినిమాలలో ఏ సినిమాను, ఏ సిరీస్ కు.. ఎక్కువ ఆదరణ లభించిందో కూడా.. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. దానితో పాటు టాప్ 10 ట్రెండింగ్ లో కొనసాగుతున్న సినిమాల జాబితా కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో రీసెంట్ గా రిలీజ్ అయినా సినిమాలు ,సిరీస్ లలో ఈ వారం టాప్ 10 ట్రెండింగ్ లో కొనసాగుతున్న సినిమాల జాబితా ఇలా ఉంది.

1. బడే మియన్ చోటే మియన్
2. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి
3. అండర్ ప్యారిస్
4. క్రూ
5. లపాతా లేడీస్
6. ఫోకస్
7. హిట్ మ్యాన్
8. సైతాన్
9. ఆర్టికల్ 370
10. సేఫ్ హౌస్

థియేటర్ లో యావరేజ్ టాక్ సంపాదించినా కూడా.. ఓటీటీ లలో మాత్రం కొన్ని సినిమాలు హిట్ టాక్ సంపాదించుకుంటాయని.. ఇప్పుడు మరో సినిమా ప్రూవ్ చేసింది. అదే టాప్ 1 ట్రెండింగ్ లో కొనసాగుతున్న బడే మియన్ చోటే మియన్ సినిమా. ఇక గత వారమే ఓటీటీ లో రిలీజ్ అయ్యి.. అప్పుడే టాప్ 2 స్థానాన్ని దక్కించుకుంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. వాటితో పాటు.. కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయినా క్రూ , లపాతా లేడీస్ , సైతాన్ , ఆర్టికల్ 370 సినిమాలు ఇంకా టాప్ 10 ట్రెండింగ్ లో కొనసాగడం విశేషం. మరి ఈ టాప్ 10 సినిమాలలో మీరు ఏ సినిమాలనైనా మిస్ చేస్తే కనుక వెంటనే చూసేయండి. ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి