• హోం
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • పాలిటిక్స్
  • సినిమా
  • రివ్యూస్
  • క్రైమ్
  • క్రీడలు
  • Nostalgia
  • వీడియోలు
  • బిగ్‌బాస్‌ 7
  • వార్తలు
  • జాతీయం
  • వైరల్
  • విద్య
  • ఉద్యోగాలు
  • టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ఆరోగ్యం
  • Home » news » Nellore Breed Cow Price Rs 35 Crore In Auction

నెల్లూరు జాతి ఆవు ఖరీదు రూ.35 కోట్లు.. వేలంలో వరల్డ్ రికార్డ్!

  • By singhj Published Date - 07:12 PM, Mon - 3 July 23 IST
నెల్లూరు జాతి ఆవు ఖరీదు రూ.35 కోట్లు.. వేలంలో వరల్డ్ రికార్డ్!

మేలు జాతి ఆవులకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రేష్టమైన ఆవులను కొనేందుకు పాడి రైతులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. వేలంలో ఎక్కువ లీటర్ల పాలు ఇచ్చే గోవులను కొనేందుకు అన్నదాతలు ఎగబడటాన్ని వార్తల్లో చూస్తూనే ఉంటాం. అయితే ఎంత మేలు జాతి ఆవైనా.. ధర రూ.లక్షల్లోనే ఉంటుంది. కానీ ఒక ఆవు మాత్రం వేలంపాటలో రికార్డు ధర పలికింది. ఏకంగా రూ.కోట్ల ధర పలికి వరల్డ్ రికార్డు సృష్టించింది. ఈ ఆవు ఎక్కడిదో కాదు.. మన నెల్లూరు జాతికి చెందినదే కావడం విశేషం. బ్రెజిల్ దేశంలో ఇటీవల నిర్వహించిన ఒక వేలంలో నెల్లూరు జాతి ఆవు రూ.35 కోట్ల ధరకు అమ్ముడుపోయి అక్కడున్న వారందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు జిల్లా నుంచి కొన్ని దశాబ్దాల కింద పలు ఆవులను బ్రెజిల్​కు తీసుకెళ్లారు. వాటి జన్యు లక్షణాలను మరింత అభివృద్ధి చేశారు. అలాంటి ఒక నెల్లూరు జాతికి చెందిన తెల్ల ఆవు కోట్ల రూపాయలు పలికి ప్రపంచంలోకెల్లా అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. వియాటినా-19 ఎఫ్​4 మారా ఇమ్​విస్​ అనే ఈ నాలుగున్న సంవత్సరాల ఆవు మూడో వంతు యాజమాన్య హక్కు ఏకంగా రూ.11.82 కోట్లకు అమ్ముడుపోయింది. గత సంవత్సరం ఈ ఆవు సగం యాజమాన్య హక్కు రూ.6.5 కోట్లకు అమ్ముడవడం అప్పట్లోనే రికార్డు క్రియేట్ చేయగా.. ఇప్పుడు అది బ్రేక్ అయింది.

మొత్తంమీద వియాటినా అనే ఈ ఆవు విలువ రూ.35.30 కోట్లు పలికింది. నాణ్యమైన జన్యు లక్షణాలు కలిగిన బ్రెజిల్​లోని నెల్లూరు జాతి ఆవును దక్కించుకునేందుకు డెయిరీ వ్యాపారులు పోటీపడటం దాని విలువను చాటిచెబుతోంది. ఇకపోతే, ప్రస్తుతం బ్రెజిల్​లో 16.70 కోట్ల నెల్లూరు జాతి ఆవులు ఉన్నాయని సమాచారం. ఆ దేశంలో ఉన్న మొత్తం ఆవుల సంఖ్యలో ఇవి 80 శాతం కావడం విశేషం. నెల్లూరు జాతికి చెందిన ఎద్దుల శ్రేష్టమైన వీర్యం అర మిల్లీలీటర్​కు రూ.4 లక్షలు పలుకుతుండటం గమనార్హం. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఈనగలగడం ఈ జాతి ఆవుల ప్రత్యేకతలుగా చెప్పొచ్చు.

Tags  

  • Andhra Pradesh
  • Auction
  • Brazil
  • cow
  • international news
  • Nellore

Related News

అరెస్ట్‌ భయంతోనే లోకేష్‌ పాదయాత్ర వాయిదా వేశాడా?

అరెస్ట్‌ భయంతోనే లోకేష్‌ పాదయాత్ర వాయిదా వేశాడా?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్కిల్‌ స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. దాదాపు 15 రోజులుగా ఆయన రాజమండ్రిలోని సెంట్రల్‌లో ఉంటున్నారు. అయితే, తండ్రి అరెస్టయిన తర్వాతినుంచి లోకేష్‌ ఏపీకి వీలైనంత దూరంగా ఉంటూ వస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఎక్కువగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టయిన నాటినుంచి ‘యువగళం పాదయాత్ర’ సాగటం లేదు. ఈ నెల 29న పాదయాత్ర పునఃప్రారంభించాలని లోకేష్‌ భావించారు. కానీ, మళ్లీ యాత్రను వాయిదా వేశారు. ఇందుకు […]

7 hours ago
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. వరల్డ్ కప్​ మనదేనంటూ..!

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గౌతం గంభీర్.. వరల్డ్ కప్​ మనదేనంటూ..!

16 hours ago
మైఖేల్ జాక్సన్ టోపీ వేలం.. ఎన్ని లక్షలకు అమ్ముడు పోయిందో తెలుసా?

మైఖేల్ జాక్సన్ టోపీ వేలం.. ఎన్ని లక్షలకు అమ్ముడు పోయిందో తెలుసా?

1 day ago
చంద్రబాబుకు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురు!

చంద్రబాబుకు సుప్రీం కోర్టులోనూ చుక్కెదురు!

1 day ago
చంద్రబాబు పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్నసుప్రీంకోర్టు జడ్జి.. ఎందుకంటే?

చంద్రబాబు పిటిషన్ విచారణ నుంచి తప్పుకున్నసుప్రీంకోర్టు జడ్జి.. ఎందుకంటే?

1 day ago

తాజా వార్తలు

  • ఆదిలాబాద్‌లో సందడి చేసిన గ్రేట్‌ ఖలీ.. చూడ్డానికి ఎగబడ్డ జనం!
    6 hours ago
  • న్యూస్ పేపర్ లో ప్యాక్ చేసిన ఆహారం.. ప్రమాదం అంటూ హెచ్చరిస్తున్న కేంద్ర సంస్థ
    6 hours ago
  • దారుణంగా మోసపోయిన నటుడు బాబీ సింహ.. కన్నీళ్లు పెట్టుకున్నాడు!
    6 hours ago
  • సిద్ధార్థ్‏కు చేదు అనుభవం.. ప్రెస్ మీట్ మధ్యలో నుంచి వెళ్లిపోయిన హీరో!
    6 hours ago
  • వీడియో: అందరూ చూస్తుండగానే గాల్లోకి ఎగిరిపోయాడు!
    7 hours ago
  • AEPS Scam: కొత్త మోసం.. ఆధార్ తో మీ బ్యాంకు ఖాతాని ఖాళీ చేస్తున్నారు!
    7 hours ago
  • వరల్డ్ కప్ టీమ్ లో మార్పు! అశ్విన్ వచ్చేశాడు
    7 hours ago

సంఘటనలు వార్తలు

  • పాకిస్తాన్‌ క్రికెట్‌ టీమ్‌కు అదిరిపోయే ఆతిథ్యం.. మెనూలో ఏమేం ఉన్నాయంటే
    7 hours ago
  • ‘మార్క్ ఆంటోనీ’ సెన్సార్ కోసం లంచం.. హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు
    7 hours ago
  • పదేళ్ల నుంచి ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు! ఏం ఆడుతున్నావ్‌ జడ్డూ?
    8 hours ago
  • ఖలిస్థానీ ఉగ్రవాదుల హెచ్చరికలు.. వరల్డ్‌ కప్‌ ఆతిథ్య స్టేడియంను పేల్చేస్తామంటూ
    8 hours ago
  • ఇంట్లోనే గంజాయి మొక్కల పెంపకం.. పోలీసుల అదుపులో నిందితుడు
    8 hours ago
  • ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు స్కామ్‌.. భువనేశ్వరి, బ్రాహ్మణిల అరెస్ట్‌ తప్పదంటూ వార్తలు
    8 hours ago
  • ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి
    8 hours ago

News

  • Box Office
  • Movies
  • Events
  • Food
  • Popular Social Media
  • Sports

News

  • Reviews
  • Spot Light
  • Gallery
  • USA Show Times
  • Videos
  • Travel

follow us

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • about us
  • Contact us
  • Privacy
  • Disclaimer

Copyright 2022 © Developed By Veegam Software Pvt Ltd.

Go to mobile version