iDreamPost

నజ్రియా – నాని – అంజన.. ‘అంటే సుందరానికీ’ సాంగ్ కు స్టెప్పులేసిన నాని భార్య

నజ్రియా – నాని – అంజన.. ‘అంటే సుందరానికీ’ సాంగ్ కు స్టెప్పులేసిన నాని భార్య

నేచురల్ స్టార్ నాని – మళయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ జంటగా వస్తోన్న సినిమా ‘అంటే సుందరానికీ’. నజ్రియా ఈ సినిమా ద్వారా డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంటే సుందరానికీ’ సినిమా రేపు (జూన్ 10) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ప్రమోషన్స్ వేగం పెంచారు. అందులో భాగంగా.. సినిమా నుంచి ఒక సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఆ సాంగ్ కు నజ్రియా-నాని స్టెప్పులేశారు.

కాగా.. ఈ పాటకు నజ్రియాతో కలిసి నాని భార్య అంజన డ్యాన్స్ చేసింది. బ్యాగ్రౌండ్ లో ఉన్న స్క్రీన్ పై పాట ప్లే అవుతుండగా.. నజ్రియా – అంజన తమ స్టైల్లో స్టెప్పులేశారు. మధ్యలో నాని కూడా జాయిన్ అయి ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆ వీడియోను నజ్రియా తన ఇన్ స్టా లో షేర్ చేస్తూ.. నాని – అంజనలతో కలిసి డ్యాన్స్ చేయడం చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చింది. నజ్రియా షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Nazriya Nazim Fahadh (@nazriyafahadh)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి