iDreamPost

మ్యాంగో మ్యాన్​ నవీన్​కు గోల్డెన్ ఛాన్స్.. కోహ్లీతో పార్ట్-2 చూస్తామా?

  • Author singhj Published - 06:16 PM, Wed - 13 September 23
  • Author singhj Published - 06:16 PM, Wed - 13 September 23
మ్యాంగో మ్యాన్​ నవీన్​కు గోల్డెన్ ఛాన్స్.. కోహ్లీతో పార్ట్-2 చూస్తామా?

ఐపీఎల్-2023లో బాగా హైలైట్ అయిన అంశాల్లో ఆర్సీబీ ఆటగాడు విరాట్ కోహ్లీ-లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ నవీన్ ఉల్ హక్ మధ్య గొడవ ఒకటి. ఇరు జట్లకు మధ్య జరిగిన మ్యాచ్​లో బ్యాటింగ్ చేస్తున్న నవీన్ ఉల్​ హక్​ను కోహ్లీ కవ్వించడం, స్లెడ్జింగ్ చేయడం గురించి తెలిసిందే. కోహ్లీకి నవీన్ దీటుగా బదులివ్వడం.. మ్యాచ్ తర్వాత ఈ విషయంపై విరాట్​తో లక్నో మెంటార్ గౌతం గంభీర్​ బాహాబాహీకి దిగడం అప్పట్లో క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో నవీన్ ఉల్​ హక్​ను, గంభీర్​ను విరాట్ ఫ్యాన్స్ టార్గెట్ చేసుకొని వాళ్లు కనిపించినప్పుడు అరవడం, రెచ్చగొట్టడం హాట్ టాపిక్​గా మారింది. సోషల్ మీడియాలోనూ నవీన్​ను మ్యాంగో మ్యాన్​ అంటూ కోహ్లీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తూ వచ్చారు.

ఐపీఎల్ పదహారో సీజన్​లో ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు అర్హత సాధించలేదు. ఒకవేళ ప్లేఆఫ్స్​కు గనుక వెళ్లుంటే విరాట్-నవీన్ మధ్య మరో ఫైట్ జరిగేదని అప్పట్లో అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్లు పెట్టారు. ఆసియా కప్-2023లోనైనా నవీన్-కోహ్లీ పోరును చూడాలని ఆశపడ్డారు. కానీ అఫ్గానిస్థాన్​ గ్రూప్ దశలోనే వెనుదిరిగింది. భారత్​కు ఆ జట్టు ఎదురుపడలేదు. అయినా ఆ టీమ్​లో నవీన్ ఉల్​ హక్​కు చోటు దక్కలేదు. దీంతో కోహ్లీ, నవీన్ రైవల్రీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్​కు మళ్లీ నిరాశ తప్పలేదు. అయితే వాళ్లకో గుడ్ న్యూస్.

మ్యాంగో మ్యాన్ నవీన్ ఉల్ హక్ లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. ఆసియా కప్​-2023లో ఆడిన అఫ్గానిస్థాన్​ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన నవీన్​ను గోల్డెన్ ఛాన్స్ వరించింది. త్వరలో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్-2023లో తలపడే అఫ్గానిస్థాన్ టీమ్​కు నవీన్ సెలెక్ట్ అయ్యాడు. దీంతో అఫ్గాన్ ఫ్యాన్స్ కంటే కూడా భారత అభిమానులు, అందులోనూ కోహ్లీ ఫ్యాన్స్ ఎక్కువగా సంతోషడపడుతున్నారు. ప్రపంచ కప్​లో భాగంగా అక్టోబర్ 11వ తేదీన అఫ్గానిస్థాన్​తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్​లో కోహ్లీ-నవీన్ మధ్య రైవల్రీని, పార్ట్-2ను చూడొచ్చని అంటున్నారు. మరి.. ఈ ఇద్దరు ప్లేయర్లు ఐపీఎల్​లో జరిగిన గొడవను మర్చిపోయి బరిలోకి దిగుతారో లేదా ఒకరితో ఒకరు తిరిగి బాహాబాహీకి దిగుతారో చూడాలి.

ఇదీ చదవండి: టీమ్​లో అతనికి బాధ్యత తెలియడం లేదా?

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి