iDreamPost

PM Modi: ఆరోజున ప్రతి ఆలయాన్ని శుభ్రం చేయండి.. ప్రజలకు ప్రధాని పిలుపు

  • Published Jan 12, 2024 | 5:09 PMUpdated Jan 12, 2024 | 5:09 PM

జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట సందర్బంగా.. నరేంద్ర మోడీ దేశంలోని అన్ని ఆలయాలను శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కాలారామ్ ఆలయాన్ని కూడా ఆయన సందర్శించినట్లు తెలిపారు.

జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రతిష్ట సందర్బంగా.. నరేంద్ర మోడీ దేశంలోని అన్ని ఆలయాలను శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో కాలారామ్ ఆలయాన్ని కూడా ఆయన సందర్శించినట్లు తెలిపారు.

  • Published Jan 12, 2024 | 5:09 PMUpdated Jan 12, 2024 | 5:09 PM
PM Modi: ఆరోజున ప్రతి ఆలయాన్ని శుభ్రం చేయండి.. ప్రజలకు ప్రధాని పిలుపు

అయోధ్య రామయ్య ప్రతిష్ట వైభోగ కళ.. దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో కనిపించనుంది. ఇప్పటికే చాలా దేవాలయ అధికారులు దానికి సంబంధించిన ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ జనవరి 22వ తేదీ లోపు దేశంలోని అన్ని ఆలయాలను శుభ్రం చేయాలనీ పిలుపునిచ్చారు. తాజాగా నరేంద్ర మోడీ.. మహారాష్ట్రలోని నాసిక్‌లో పర్యటించారు. రామ్‌కుండ్‌తోపాటు శ్రీ కాలరామ్ ఆలయాన్ని కూడా సందర్శించారు. ఈ క్రమంలో ఆలయాలను శుభ్రపరచాలనే అభ్యర్ధన చేశారు. అంతే కాకుండా కాలారామ్ ఆలయ ప్రాంగణాన్ని కూడా తానే స్వయంగా శుభ్రం చేశారు. అలాగే రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ శుభ సందర్భంగా.. అందరూ వారి శ్రమను విరాళంగా అందించాలని.. దేశప్రజలకు సూచించారు.

అయితే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా.. నాసిక్‌లో ఉండటం అదృష్టంగా భావిస్తున్నానని మోదీ తెలిపారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదని.. ఎన్నో ఆధ్యాత్మిక భక్తి భావాలతో కూడిన మహారాష్ట్ర ప్రభావం అన్నారు. భారతదేశానికి చెందిన ఎందరో మహనీయులు ఇక్కడి నుంచే ఆవిర్భవించారని ఆయన పేర్కొన్నారు. ఈ భూమి మీద శ్రీరాముడు చాలా కాలం గడిపారని, ఈ భూమికి నివాళులర్పిస్తున్నానని అన్నారు. కాగా, ప్రధాన మంత్రి తన ప్రసంగంలో స్వామి వివేకానందతో పాటు.. శ్రీ అరబిందోను కూడా స్మరించుకున్నారు. మన దేశంలో సాధువుల నుండి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ యువశక్తిని ప్రధానం చేసారని ఆయన తెలియాజేశారు. దేశం తన సాధించాలంటే.. యువత ఇండిపెండెంట్ గా ముందుకు సాగాలని సూచించారు. భారతదేశం అభివృద్ధి యువత చేతిలోనే ఉందని అన్నారు. శ్రీ అరబిందో, స్వామి వివేకానంద మార్గదర్శకత్వం.. 2024లో భారతదేశ యువతకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని ఆయన వెల్లడించారు.

Clean every temple on that day

అంతే కాకుండా దేశంలోని యువత అంతా ‘మేరా యువ భారత్ సంఘటన్’లో పాల్గొనడం.. చాలా ఉత్సాహంగా ఉందని మోదీ అన్నారు. మై యూత్ ఇండియా ఆర్గనైజేషన్ స్థాపించిన తర్వాత.. ఇదే తొలి యువజన దినోత్సవం, పైగా ఈ సంస్థకు 75 రోజులు కూడా పూర్తి కాకముందే .. సుమారు 1.10 కోట్ల మంది యువత తమ పేర్లను ఇందులో నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇక అయోధ్య లో జనవరి 22న రామ మందిర ప్రతిష్టాపన .. మోడీ చేతుల మీదుగా జరగనున్న సంగతి తెలిసిందే. మరి, ఈ క్రమంలో దేశంలోని అన్ని దేవాలయాలను శుభ్ర పరచాలని మోడీ ఇచ్చిన పిలుపుపై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి