Arjun Suravaram
Arjun Suravaram
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ప్రతిపక్ష టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుబడిందని, పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తెల్లారి లేచింది మొదలు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్, ఇతర నేతలు విమర్శిస్తుంటారు. కొత్త పరిశ్రమలు రావడం లేదని, రాష్ట్రా ఆర్థిక వ్యవస్థను జగన్ మోహన్ రెడ్డి ఛిన్నాభిన్నం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తుంటారు. అయితే ఇలా టీడీపీ విమర్శలు చేస్తుంటే వారి అధినేత చంద్రబాబు నాయుడి భార్య.. ఏపీలో తమ వ్యాపార విస్తరణ చేశారు. దీంతో రాష్ట్రంలో పరిశ్రమ విస్తరణ, కొత్త పెట్టుబడులు జరుగుతున్నాయనడానికి ఇదే నిదర్శనమని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
చిత్తూరు జిల్లాలో ఎంపీ గల్లా జయదేవ్ కి చెందిన అమర్ రాజా పరిశ్రమ రాష్ట్రం నుంచి తరలిపోయిందటూ చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ ఆరోపించారు. అయితే ఇదే సమయంలో టీడీపీ నేతతో పాటు ఎల్లో మీడియా కూడా పచ్చరాతలు రాసిందని పలువురు వైసీపీ నేతలు అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబు సతీమణి చేసిన పనికి వారికి కళ్లు తెరిపించిందని అంటున్నారు. జగన్ పాలనలో ఆమెకిచ్చిన ధైర్యం ఏంటో తెలియదు కానీ, ఏపీలో భువనేశ్వరి విస్తరించడం చర్చనీయాంశమైంది. మంగళవారం భువనేశ్వరి కుప్పంలో పర్యటించారు. బుధవారం అత్తింటి వారి గడప ఆమె తొక్కారు. చంద్రగిరి మండలం కాశీపెంట్ల సమీపంలో గోకుల్ హెరిటేజ్ రెండో పార్లర్ ను భవనేశ్వరి ప్రారంభించారు.
తన పార్లర్ లోని వస్తువులను భువనేశ్వరి కొని.. వాటిని ఉద్యోగులు, స్థానికులకు స్వయంగా పంచిపెట్టారు. ఈ కార్యక్రమం… పరిశ్రమలు తరలిపోతున్నాయని నిత్యం విమర్శించే బాబు, లోకేశ్ సమాధానంగా ఉందని కొందరు అంటున్నారు. జగన్ పాలన వల్ల పారిశ్రమిక వేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే సొంత సంస్థ హెరిటేజ్ భువనేశ్వరి ఎలా ప్రారంభించారని వైసీపీ నేతల నుంచి ప్రశ్నలు ఎదురువుతున్నాయి. భువనేశ్వరి..తన హెరిటేజ్ పార్లర్ ను రెండో యూనిట్ ను చంద్రగిరిలో విస్తరించడం ద్వారా, ఆమె భర్త, తనయుడు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదని నిరూపించినట్లైందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. మరి… ఈ విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.