iDreamPost

నెవర్ బిఫోర్ సాహసం చేస్తున్న నాని

నెవర్ బిఫోర్ సాహసం చేస్తున్న నాని

నేచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస సినిమాలు ఒప్పుకుని చేస్తున్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల క్రితం టక్ జగదీష్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన నాని ఆ సినిమా ద్వారా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా కూడా నిలిచాడు. లవ్ స్టోరీ సినిమా టక్ జగదీష్ సినిమా ఒకేసారి విడుదల అయ్యే క్రమంలో ఇండస్ట్రీ మొత్తం మీద నాని హాట్ టాపిక్ గా మారారు. ఎట్టకేలకు టక్ జగదీష్ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కాగా అది మిశ్రమ స్పందన అందుకుంది.. అయితే బాక్సాఫీస్ పరంగా చూసుకుంటే జెర్సీ సినిమా తర్వాత నానివి మూడు సినిమాలు విడుదల అయ్యాయి. జెర్సీ సినిమా బాక్సాఫీస్ పరంగా హిట్ గా నిలవగా ఆ తర్వాత వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా యావరేజ్ అనిపించుకుంది..

ఇక ఆ తర్వాత ‘వి’ అలాగే ‘టక్ జగదీష్’ రెండు సినిమాలు అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదల కావడంతో నిర్మాతలు సేఫ్. అయితే ఈ రెండు సినిమాలకు డివైడ్ టాక్ వచ్చింది. ముందు నుంచి కూడా చాలా సేఫ్ గేమ్ ఆడుతూ లవ్ స్టోరీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీలు చేసుకుంటూ వచ్చిన నాని మొట్టమొదటిసారిగా భారీ రిస్క్ చేస్తున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతానికి నానీ చేతిలో దాదాపు మూడు సినిమాలున్నాయి.. ఆయన హీరోగా వస్తున్న శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సహా మరో కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు అసలు విషయం ఏమిటంటే అంటే సుందరానికి అనే సినిమా విషయంలోనే నాని చాలా పెద్ద రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంత జరగగా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయింది. తాజాగా టాలీవుడ్ వర్గాలు ప్రచారం మేరకు ఈ సినిమాలో నాని పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో ఆయన గే పాత్రలో నటిస్తున్నాడని నాని క్యారెక్టరైజేషన్ చుట్టూ ఉన్న కామెడీ ట్రాక్ ఈ సినిమాకు హైలైట్ అని అంటున్నారు. ఇది నాని కెరీర్ లోనే కాక దాదాపు తెలుగు లో టాప్ హీరోలు ఎవరూ కూడా ఇలాంటి రోల్స్ చేయలేదనే చెప్పాలి. నటుడు అంటే కేవలం అనువుగా ఉన్న పాత్రలే కాదు ఎలాంటి పాత్ర వచ్చినా సరే దానికి అనుగుణంగా నటుడు మారి సినిమా చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కథకు నాని ఓకే చెప్పాడని తెలుస్తోంది. దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మలయాళ భామ నజ్రియా నజీమ్ హీరోయిన్ గా నటిస్తోంది. చూడాలి మరి నాని సాహసం ఏ మేరకు ఆయనకు కలిసొస్తుందో అనేది.

Also Read: సెలబ్రిటీ పెళ్లిళ్లు – గాలిలో దీపాలు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి