iDreamPost
android-app
ios-app

కల్కి మూవీలో ఇద్దరు తెలుగు హీరోలు.. ప్రభాస్‌తో కలిస్తే ఇక అంతే

  • Published Apr 22, 2024 | 9:03 PM Updated Updated Apr 22, 2024 | 9:03 PM

కల్కి మూవీపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేసి అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఇద్డరు స్టార్ హీరోలు నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

కల్కి మూవీపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కి సంబంధించిన వీడియో రిలీజ్ చేసి అంచనాలు పెంచేసింది. ఈ క్రమంలో మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ మూవీలో ఇద్డరు స్టార్ హీరోలు నటిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి.

  • Published Apr 22, 2024 | 9:03 PMUpdated Apr 22, 2024 | 9:03 PM
కల్కి మూవీలో ఇద్దరు తెలుగు హీరోలు.. ప్రభాస్‌తో కలిస్తే ఇక అంతే

ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్కి మానియానే నడుస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మూవీ కావడం.. విభిన్నమైన అభిరుచి కలిగిన నాగ్ అశ్విన్ ఈ సినిమాకి దర్శకుడు కావడం.. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్, దీపికా పదుకొనే లాంటి స్టార్స్ ఈ మూవీలో నటిస్తుండడంతో ఈ సినిమాకి భారీ హైప్ ఏర్పడింది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్ అశ్వత్థామ పాత్రకు సంబంధించిన వీడియోను చిత్ర యూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో అశ్వత్థామ పాత్ర ఎలా ఉండబోతుంది? అనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పకనే చెప్పారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో స్టార్ కాస్ట్ ఎక్కువే అని తెలుస్తుంది. ఇప్పటికే పెద్ద పెద్ద స్టార్లు నటిస్తున్న ఈ మూవీలో మరో ఇద్దరు స్టార్లు కూడా తోడవుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.

నేచురల్ స్టార్ నాని, ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ ఈ మూవీలో కనిపిస్తారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. వీరిద్దరూ అతిథి పాత్రల్లో మెరుస్తారని ఆ వార్తల సారాంశం. అయితే దీనిపై ఒక స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో ప్రముఖ మలయాళ నటి అన్నాబెన్ కూడా నటిస్తున్నారు. ఇక దుల్కర్ సల్మాన్ కూడా ఈ మూవీ గురించి మాట్లాడుతూ.. ఈ మూవీలో నటిస్తున్న విషయాన్ని ఇప్పుడు చెప్పాలనుకోవడం లీని.. కానీ కల్కి సెట్స్ అద్భుతంగా ఉన్నాయని.. ఇలాంటివి నాగ్ అశ్విన్ మాత్రమే డిజైన్ రూపొందించగలడని అన్నారు. దీంతో దుల్కర్ సల్మాన్ కూడా ఈ మూవీలో ఉన్నాడని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇలా పెద్ద స్టార్స్ తో పాటు యువ హీరోలు కూడా కల్కి 2898 మూవీలో భాగమవుతుండడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

నాగ్ అశ్విన్ పలు భాషలకు చెందిన నటీనటులను తీసుకోవడం వల్ల సినిమాకి బాగా ప్లస్ అవుతుందని అంటున్నారు. అన్ని భాషల్లోనూ ఆయా నటీనటులు కల్కి సినిమాని బాగా ప్రమోట్ చేస్తారని.. అక్కడి జనానికి ఈ మూవీ బాగా రీచ్ అవుతుందని.. నాగ్ అశ్విన్ మామూలు బుర్ర కాదని కామెంట్స్ చేస్తున్నారు. తెలుగులో నాని, విజయ్ దేవరకొండ.. తమిళంలో కమల్ హాసన్, బాలీవుడ్ లో అమితాబ్, దీపికా, దిశా పఠానీ.. మలయాళంలో దుల్కర్ సల్మాన్, అన్నాబెన్ లు ఇలా వీరంతా సినిమాని మరింత చేరువయ్యేలా చేస్తారని నాగ్ అశ్విన్ వీళ్ళని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదలపై ప్రభాస్ అభిమానులతో పాటు కామన్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మరి ప్రభాస్ కల్కి సినిమాలో నాని, విజయ్ దేవరకొండ నటిస్తున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయమేమిటి? నటిస్తే ఎలా ఉంటుంది? ఒకవేళ ఇదే నిజమైతే వారి పాత్రలు ఏమై ఉండవచ్చో కామెంట్ చేయండి.

 

View this post on Instagram

 

A post shared by IDream Media (@idreammedia)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom