iDreamPost
android-app
ios-app

నాగార్జున ఔట్.. బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ!

  • Published Dec 15, 2022 | 10:35 AM Updated Updated Dec 15, 2022 | 10:35 AM
నాగార్జున ఔట్.. బిగ్ బాస్ హోస్ట్ గా బాలకృష్ణ!

బిగ్ బాస్ తెలుగు సీజన్-6 ముగింపు దశకు చేరుకుంది. అయితే సీజన్ సీజన్ కి ఈ షోకి ప్రేక్షకుల ఆదరణ తగ్గుతూ వస్తోంది. ముఖ్యంగా ఈ ఆరో సీజన్ పై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో రేటింగ్స్ దారుణంగా పడిపోయాయి. వచ్చే సీజన్ ను అసలు ప్రేక్షకులు పట్టించుకుంటారా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో మరో షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. రాబోయే సీజన్ నుంచి హోస్ట్ గా నాగార్జున తప్పుకున్నట్లు తెలుస్తోంది.

బిగ్ బాస్ మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఆయన షోని నడిపించిన విధానం ఆకట్టుకోవడంతో త్వరగానే తెలుగు ప్రేక్షకులు ఈ షోకి దగ్గరయ్యారు. రెండో సీజన్ కి హోస్ట్ గా వ్యవహరించిన నాని కూడా తనదైన శైలిలో మెప్పించాడు. ఇక మూడో సీజన్ నుంచి నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. మొదటి రెండు సీజన్లను మించేలా.. ఆయన హోస్ట్ చేసిన మూడు, నాలుగు సీజన్లకు మంచి రేటింగ్స్ వచ్చాయి. అయితే ఐదో సీజన్ నుంచి రేటింగ్స్ పడిపోతున్నాయని అంటున్నారు. ఇక ఆరో సీజన్ కి అయితే నాగార్జున స్థాయికి తగ్గట్లుగా రేటింగ్స్ రావట్లేదనే అభిప్రాయం ఉంది. మరోవైపు వరుసగా నాలుగు సీజన్ల నుంచి తనే హోస్ట్ గా చేస్తుండటంతో ఆడియెన్స్ కి బోర్ కొట్టిందని నాగార్జున భావించినట్లు ఉన్నాడు. అందుకే ఏడో సీజన్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. మరోవైపు బిగ్ బాస్ యాజమాన్యం కూడా కొత్త హోస్ట్ తో సరికొత్తగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని భావిస్తోందట.

ప్రస్తుతం బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త హోస్ట్ ని వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఏడో సీజన్ కి నందమూరి బాలకృష్ణను రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వినికిడి. ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమవుతోన్న అన్ స్టాపబుల్ షోతో హోస్ట్ గా బాలకృష్ణ అదరగొడుతున్నాడు. ఇప్పటికే మొదటి సీజన్ పెద్ద హిట్ కాగా, రెండో సీజన్ కూడా అదే జోష్ లో నడుస్తోంది. ఇందులో బాలకృష్ణ మాటలకు, ఆయన ఎనర్జీ లెవల్స్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తే చూడాలనే కామెంట్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా వినిపించాయి. ఇక ఇప్పుడు షో నిర్వాహకులు సైతం బాలకృష్ణను హోస్ట్ గా తీసుకొచ్చేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మరి బిగ్ బాస్-7 హోస్ట్ గా బాలకృష్ణ ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాలంటే కొంతకాలం వేచి చూడాలి.

Jojobet Girişivermectin tabletMadridbetMadridbetMadridbetmeritbetCasibom GirişmeritbetsuperbetinMeritbet güncel girişJojobet GirişcasibomHoliganbetgalabetHoliganbetJojobetHoliganbetJojobetHoliganbetJojobet GirişJojobet Giriş