iDreamPost

ఒంటరిగా ఉన్న మహిళపై దుండగుల దారుణం.. ఏకంగా నడి రోడ్డుపైనే..!

తెలంగాణలో మరో దారుణం వెలుగు చూసింది. ఇటీవల తెల్లవారు జామున ఈ మహిళ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా గమనించారు. ఆ తర్వాత చేయాల్సింది చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగిందంటే?

తెలంగాణలో మరో దారుణం వెలుగు చూసింది. ఇటీవల తెల్లవారు జామున ఈ మహిళ రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా గమనించారు. ఆ తర్వాత చేయాల్సింది చేసి అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగిందంటే?

ఒంటరిగా ఉన్న మహిళపై దుండగుల దారుణం.. ఏకంగా నడి రోడ్డుపైనే..!

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఒంటరిగా వెళ్తున్న మహిళపై ఊహించని కిరాతకానికి పాల్పడ్డారు. నడి రోడ్డుపైనే ఎవరూ లేని టైమ్ చూసుకుని కిరాతకానికి పాల్పడ్డారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఉన్నట్టుండి ఇలా జరగడంతో ఈ మహిళ తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకు ఈ మహిళ ఎవరు? ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో రవి కుమార్-మంజుల (34) అనే దంపతులు నివాసం ఉండేవారు. వీరికి చాలా ఏళ్ల కిందటే వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి వీరికి ఓ కుమారుడు జన్మించాడు. పుట్టిన కొడుకుని ఈ దంపతులు సంతోషంగానే ఉండేవారు. అయితే, గత 7 ఏళ్ల నుంచి ఈ భార్యాభర్తలు ఉప్పు, నిప్పు అన్నట్లుగా ఉంటున్నారు. తరుచు గొడవలు జరుగుతుండడంతో చాలా కాలం నుంచి మంజుల పుట్టినిల్లు అయిన నల్గొండలోని వెలుగుపల్లిలో తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది మంజుల ఇక్కడే ఓ కాలేజీలో వంట మనిషిగా చేస్తూ సంసారాన్ని వెల్లదీస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ మహిళ డ్యూటీ కోసం కోసమని బుధవారం తెల్లవారు జామున నడి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెను గమనించిన కొందరు గుర్తు తెలియని దుండగులు మంజులను అతి దారుణంగా హత్య చేశారు.

ఆ తర్వాత మృతదేహాన్ని కనిపించకుండా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అనంతరం వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య సమయంలో ఆ దుండుగులు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకుని మృతురాలి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే, ఇంతకు ఈ మహిళను హత్య చేసింది ఎవరు? ఎందుకు చేయాల్సి వచ్చింది? హత్య అనంతరం డెడ్ బాడీని ఎక్కడికి తీసుకెళ్లారనే పూర్తి విషయాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు ముందు రోజు మృతురాలి కాల్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి