iDreamPost
android-app
ios-app

కన్న తండ్రిపై కొడుకు కిరాతకం! మరీ ఇంత దారుణమా?

కన్న తండ్రిపై కొడుకు కిరాతకం! మరీ ఇంత దారుణమా?

నల్గొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు తండ్రి అని కూడా చూడకుండా కిరాతకానికి పాల్పడ్డాడు. అతడు చేసిన పనికి గ్రామస్తులు అంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం అందడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పోతునూరు గ్రామంలో వెంకటయ్య (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి రాజాబాబు (38) అనే కుమారుడు ఉన్నాడు. ఈయనకు పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఇతగాడు ఐదేళ్ల కిందట భార్యతో గొడవపడి పెళ్లాం, పిల్లలకు దూరంగా ఉంటూ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నాడు. ఇదిలా ఉంటే.. రాజాబాబు తన తల్లిదండ్రులతో కూడా తరుచు గొడవ పడుతుండేవాడు. ఇక బుధవారం కూడా తన తండ్రి వెంకటయ్యతో వాగ్వాదానికి దిగాడు. ఈ క్రమంలోనే రాజాబాబు కోపంతో ఊగిపోయి తన తండ్రిని రాయితో కొట్టాడు. ఇంతే కాకుండా సిమెంట్ రోడ్డుపై తండ్రిని ఎత్తేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

అతని కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఇక పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వెంకటయ్య గురువారం సాయంత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఆయన చనిపోవడంతో అతని భార్య గుండెలు పగిలేలా ఏడ్చింది. అనంతరం ఆమె స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişCasibomcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobetJojobet GirişcasibomMadridbet