iDreamPost
android-app
ios-app

కార్తీక పౌర్ణమి నాడు.. శివయ్యను దర్శించేందుకు వచ్చిన నాగన్న..!

కార్తీక మాసం వచ్చిందంటే చాలు శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక కార్తీక పున్నమి సంగతి చెప్పనక్కర్లేదు. ఆ రోజు రాత్రి నుండి వేలాది మంది భక్తులు శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే తాను కూడా తన ఇష్ట దైవాన్ని చూసేందుకు వచ్చిందో నాగన్న..

కార్తీక మాసం వచ్చిందంటే చాలు శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి. ఇక కార్తీక పున్నమి సంగతి చెప్పనక్కర్లేదు. ఆ రోజు రాత్రి నుండి వేలాది మంది భక్తులు శివాలయాలను సందర్శిస్తూ ఉంటారు. అయితే తాను కూడా తన ఇష్ట దైవాన్ని చూసేందుకు వచ్చిందో నాగన్న..

కార్తీక పౌర్ణమి నాడు.. శివయ్యను దర్శించేందుకు వచ్చిన నాగన్న..!

శివ, కేశవులకు ఇష్టమైన మాసం కార్తీకం. ఈ నెల రోజులు శైశవ, విష్ణు దేవాలయాలు కిటకిటలాడుతుంటాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు భక్తులు. ఈ రోజు సూర్యోదయం కాకుండానే నదీ స్నానం ఆచరించి, ఒత్తులు వెలిగించి, సమీపంలోని శివాలయాన్ని సందర్శిస్తుంటారు. శివ నామస్మరణతో ఆలయాలు మార్మోగిపోతూ ఉంటాయి. దీప ధూప నైవేద్యాలతో శివరాధన చేస్తారు. మిగిలిన రోజులు పూజలు చేయకపోయినా.. కార్తీక పున్నమి నాడు పూజలు చేస్తే.. ఏడాదంతా పూజ చేసిన ఫలితం దక్కుతుందని విశ్వసిస్తారు భక్తులు. అందుకే కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారకుండానే స్నానమాచరించి.. గుడిలో 365 ఒత్తులు వెలిగించి.. శివరాధన చేస్తారు భక్తులు. ఈ రోజంతా దేశంలో ఉన్న ఆలయాల్లో రుద్రాభిషేకాలు, లక్ష బిల్వార్జనలు, రుద్ర పూజలు, ప్రత్యేక పూజలు చేస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ శివాలయాల్లో ఒకటి.. శ్రీశైలంలో కొలువై ఉన్న భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి దేవాలయం. కార్తీక పూర్ణిమ పురస్కరించుకుని శివయ్యను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు పొటేత్తారు. రాత్రి నుండి ఈ దేవాలయం ఇసుక వేస్తే రాలనంత జనం చేరుకున్నారు. శివయ్యను కన్నులారా తిలకించి.. ఆయన కరుణా కటాక్షాల కోసం గంటల కొలదీ క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. అయితే ఈ నీలకంఠుడు ఆభరణమైన సర్పరాజు సైతం తన ఇష్టదైవాన్ని తిలకించాలని అనుకుంది. మెల్లిగా గుడిలోకి ప్రవేశించి ఎవ్వరి కంటా కనిపించకుండా కార్పేట్‌లోకి గబుక్కున దూరేసింది. అయితే నాగన్న తోక బయటకు కనిపించడంతో ఎవరో చూసి చెప్పడంతో.. ఒక్కసారిగా  పరుగులు తీశారు భక్తులు.

మెల్లిగా మల్లన్న గర్భగుడి ఎదురుగా ఉన్న ఉమా రామలింగేశ్వర స్వామి మండపంలోకి చేరి.. అక్కడ ఉన్న కార్పెట్‌లో తలదాచుకుంది. అంతలో ఆలయ సిబ్బంది గుర్తించి.. వెంటనే పాములను పట్టే రాజు అనే వ్యక్తిని పిలిపించారు. వెంటనే కార్పెట్‌లో దాగి ఉన్న పామును మెల్లిగా బయటకు తీస్తూ ఉంటే.. వస్తూనే ఉంది. చూస్తుంటే సుమారు 8 అడుగులు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొందరు ఈ పామును చూసి భయానికి గురైతే.. మరికొంత మంది శివయ్యే ఆ పాము రూంపలో వచ్చారని సంబర పడుతున్నారట. కార్తీక పౌర్ణమి రోజు శివయ్య నిజ దర్శనం దొరికిందని ఆనందపడ్డారట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. కార్తీక పున్నమి నాడు శివాలయంలోకి నాగరాజు రావడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి