iDreamPost

నాగబాబూ ఇలా ఐతే ఎలా…?

నాగబాబూ  ఇలా ఐతే ఎలా…?

నాగబాబు…మెగా బ్రదర్ గా తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి తెలియని వారు లేరనే చెప్పాలి. చిరంజీవి తమ్ముడిగానే కాకుండా కొన్ని సినిమాల్లో నటించిన నాగబాబుది ఒకింత విలక్షణ శైలి. అన్నయ్యలా సౌమ్యంగా ఎవరేమనుకున్నా పక్కకు తప్పుకు వెళ్లిపోయే టైప్ కాదు ఈయన. ఒకరకంగా మెగా ఫ్యామిలీకి అధికార ప్రతినిధిగా నాగబాబును పేర్కొనవచ్చు. ఐతే నాగబాబు తాజాగా వైఎస్సార్సీపీపై చేసిన విమర్శలు విధంగా మారాయి. తమ్ముడు పెట్టిన పార్టీకి ఉపయోగపడాలనో లేదా తన ఫామిలీ పై వచ్చే విమర్శలకు సమాధానం చెప్పాలనో నాగబాబు నా ఇష్టం అనే యూట్యూబ్ ఛానల్ పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా పేస్ బుక్ లోకి ప్రవేశించిన అయన అందులో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

రాజధాని రైతుల పోరాటం నిజంగా ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రైతుల పోరాటం స్ఫూర్తి దాయకం. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నా.. .మీ పోరాటం వృధా పోకూడదని కోరుతున్నా…! రాజధాని రైతుల మీద తప్పుడు కామెంట్స్ చేసే అధికార పార్టీ ఎమ్మెల్యేలు రూముల్లో కాకుండా ఒక్కసారి రాజధాని ప్రాంతం లో ఒక మీటింగ్ పెట్టి.. ఇలాంటి కామెంట్స్ చేస్తే వాళ్ళు మీకు చేసే సన్మానం కళ్లారా చూడాలని ఉంది… ఇవీ అయన చేసిన కామెంట్స్ లో కొన్ని…! ఇక్కడ రైతులకు అండగా నిలబడాలనే నాగబాబు ఆలోచనను తప్పుబట్టాల్సిన పని లేదు. కానీ మంత్రులు అమరావతి వచ్చి మీటింగ్ పెడితే అక్కడి ప్రజలు తిరగబడి కొడతారనే తరహాలో వ్యాఖ్యానించటం నిజంగా గర్హనీయమని చెప్పాలి. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే తమ్ముడు పవన్ తరహా లోనే నాగబాబు సైతం టీడీపీ ఉచ్చులో పడ్డారని స్పష్టమవుతోంది.

కులం ఎప్పుడు చెడ్డది కాదు. మనుషులలో చెడ్డ వాళ్ళు మంచి వాళ్ళు వుంటారు. ఇలా కులాలమీద పగబట్టి వాళ్ళ జీవితాలతో ఆదుకోవడం ఎవరికి మంచిదికాదు. యూదుల మీద పగబట్టి వాళ్ళ జాతిని నాశనం చేసిన ఆడాల్ఫ్ హిట్లేర్ కన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు. అలాంటి హిట్లర్ కూడా నాశనం అయిపోయాడు. ప్లీస్ జగన్ రెడ్డి గారు మీరు ఆ తప్పు చేయకండి..! ఇవి నాగబాబు కామెంట్స్ లో రెండవ భాగం…! కులం ఎప్పుడు చెడ్డది కాదు…అక్షరాలా నిజం..! ఐతే సదరు కులంలో అత్యధికులు లేదా కొంత మంది చేసే పనుల వల్ల సదరు కులానికి మంచి పేరైనా వస్తుంది లేదా చెడ్డ పేరైనా వస్తుంది. ఇది కాదనలేని వాస్తవం. ఏపీలో గత కొన్ని దశాబ్దాలుగా ఒక కులంలోని కొంత మంది ఇతర సామాజికవర్గాల వారిని ఎదగనీయకుండా తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు. ఈ విషయం నాగబాబుకు తెలియంది కాదు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు అయన జెండా పీకింది ఎవరో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇదే పక్రియ తదనంతరం శృతిమించటం తో గత ఎన్నికల్లో ఒక సామాజిక వర్గానికి వ్యతిరేకంగా సోషల్ ఇంజనీరింగ్ చాలా పెద్దస్థాయిలో జరిగింది. ఏపీ ఎన్నికల ఫలితాలను చూస్తే ఈ విషయం ఎవరికైనా అర్ధమవుతుంది.

స్వీయ అనుభవాలు తర్వాత కూడా వైస్ ఎస్ జగన్ ఓ సామజిక వర్గానికి వ్యతిరేకంగా అమరావతిని, ఒక కులాన్ని నాశనం చేస్తున్నారని నాగబాబు భావిస్తే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు. తమ్ముడు పిలిచి టిక్కెట్ ఇచ్చాడు కదా అని తమ్ముడు ఏ దారిలో వేళ్తే తానూ ఆ దారిలోనే వెళ్లానుక్కోవటం తప్పు. ఒక సోదరుడిగా తమ్ముడికి మంచి సలహాలు ఇచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన నాగబాబు టీడీపీ పల్లవే అందుకోవడం వల్ల నష్టమే కానీ లాభం ఉండదని గుర్తించాలి. కాబట్టి ఇకనైనా సొంత వ్యూహాలతో ముందుకు వెళ్తూ పవన్ కళ్యాణ్ ను సైతం అదే దారిలో నడిచేలా చూస్తే జనసేనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. అలా కాని పక్షంలో టీడీపీ తోక పార్టీలా మిగిలిపోయే ప్రమాదం ఉంది….వింటున్నారా నాగబాబు గారూ…!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి