iDreamPost

OTTలోకి వచ్చేసిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800‘ మూవీ!

థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఓ మూవీ సడన్ గా ఈ ఫ్లాట్ ఫాంలో దర్శనమిస్తోంది. ఇంతకు ఆ మూవీ ఏంటే తెలుసో.. 800. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి విదితమే.

థియేటర్లలో సందడి చేసిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. ఇటీవల థియేటర్లలో సందడి చేసిన ఓ మూవీ సడన్ గా ఈ ఫ్లాట్ ఫాంలో దర్శనమిస్తోంది. ఇంతకు ఆ మూవీ ఏంటే తెలుసో.. 800. లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కిన సంగతి విదితమే.

OTTలోకి వచ్చేసిన ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800‘ మూవీ!

థియేటర్లలో సినిమాను ఎంజాయ్ చేసే వీక్షకులన్నట్లే.. ఓటీటీకి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా చెప్పాలంటే.. ఓటీటీలో కొత్త మూవీస్ ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసే సినిమా పిచ్చోళ్లున్నారు. పర భాష చిత్రాలను కూడా ఈ ఫ్లాట్ ఫాంలో మంచి ఆదరణ లభిస్తోంది. కేవలం ఇండియన్ చిత్రాలనే కాదూ కొరియన్, ఇంగ్లీష్ మూవీస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఓటీటీ ప్రేక్షకుల కోసమే సెపరేట్‌గా సినిమాలు, వెబ్ సిరీస్‌లు రూపొందుతున్నాయంటే అతిశయోక్తి కాదు. అయితే వీక్‌లో ఏ మూవీ విడుదల అవుతుందా అని సెర్చ్ చేస్తుంటారు. అయితే కొన్ని మూవీస్.. లిస్టులో లేనప్పటికీ.. ఆ తర్వాత సైలెంట్‌గా వచ్చేసి సందడి చేస్తున్నాయి. తాజాగా ఓ మూవీ సడన్ ఎంట్రీ ఇచ్చింది ఓటీటీలోకి.

శ్రీలంక మాజీ స్పిన్నర్, లెజెండరీ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ జీవిత ఆధారంగా తెరకెక్కించిన చిత్రం ‘800‘ ఈ ఏడాది అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైంది. ముత్తయ్య టెస్టుల్లో 800 వికెట్ల తీసి చరిత్ర సృష్టించిన సంగతి విదితమే. ఆ నంబర్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీ హిందీ, తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో విడుదలై.. మంచి టాక్ తెచ్చుకుంది. మురళీధరన్.. క్రికెటర్‌గా ఎదిగేందుకు పడ్డ కష్టాలు, అవమానాలు, ఒడిదుడుకులు ఈ చిత్రంలో చూపించారు. శ్రీలంకలో జరిగిన యుద్ధాల ప్రభావం ఆయనపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందన్న అంశాలు ఈ మూవీలో ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్లలో సచిన్, మురళీధరన్‌తో పాటు ఇతర క్రికెటర్లు పాల్గొనడంతో మూవీపై అంచనాలు పెంచింది. మూవీ మంచి ఫలితాలు చూసింది.

మురళీధరన్ పాత్రను మధుర్ మిట్టల్ పోషించారు. ఆయన భార్యగా మహిమా నంబియార్ నటించారు. ఈ చిత్రానికి వివేక్ రంగాచారి నిర్మాత కాగా, ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. గిబ్రాన్ మ్యూజిక్ అందించారు. ఇప్పుడు ఈ మూవీ ఓటీటలోకి వచ్చేసింది. ఈ మూవీ జియో సినిమాలో డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ అవుతుంది. సబ్ స్క్రిప్షన్ అవసరం లేకుండానే నేరుగా సినిమాను వీక్షించవచ్చు. 800 మూవీ హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మూవీ నుండి విజయ్ సేతుపతి తప్పుకున్న సంగతి విదితమే. ఇక ఎందుకు ఆలస్యం జియో మూవీస్‌లో చూసేయండి. ఎలా ఉందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి