iDreamPost

Weekend Suggestion: ఈ వారం OTT లోకి రాబోయే ఈ 4 సినిమాలను అస్సలు మిస్ అవ్వకండి..

  • Published May 08, 2024 | 5:56 PMUpdated May 08, 2024 | 5:56 PM

ప్రతి వారం ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూ ఉంటున్నాయి. అలాగే ఈ వారం కూడా ఏ ఏ సినిమాలు వస్తున్నాయనే వివరాలను చూశాము. మరి వాటిలో ఏ సినిమాలు ఈ వీకెండ్ కు బెస్ట్ ఛాయస్ అవుతాయో చూసేద్దాం.

ప్రతి వారం ఓటీటీ లోకి ఎన్నో సినిమాలు, సిరీస్ లు వస్తూ ఉంటున్నాయి. అలాగే ఈ వారం కూడా ఏ ఏ సినిమాలు వస్తున్నాయనే వివరాలను చూశాము. మరి వాటిలో ఏ సినిమాలు ఈ వీకెండ్ కు బెస్ట్ ఛాయస్ అవుతాయో చూసేద్దాం.

  • Published May 08, 2024 | 5:56 PMUpdated May 08, 2024 | 5:56 PM
Weekend Suggestion: ఈ వారం OTT లోకి రాబోయే ఈ 4 సినిమాలను అస్సలు మిస్ అవ్వకండి..

ఈ వారం థియేటర్ లో రిలీజ్ అయ్యేందుకు పెద్దగా చిత్రాలు ఏమి లేవు. కాబట్టి… ఈ వీకెండ్ ఎంచక్కా ఓటీటీ లో ఉండే ఈ సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేసేయొచ్చు. ప్రతి వారం ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి.. పైగా వాటిలో ఏది బెస్ట్ అనే సజ్జెషన్స్ కూడా మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ వారం అటు థియేటర్ లోను, ఇటు ఓటీటీ లోను బ్లాక్ బస్టర్ చిత్రాలైతే లేవు కానీ. ఉన్నవాటిలో మాత్రం ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలు బెస్ట్ ఛాయస్ అని చెప్పి తీరాలి. మరి ఆ సినిమాలేంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూసేద్దాం.

థియేటర్ లో ఇప్పుడు చెప్పుకోబోయే సినిమాలను మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. ఆ సినిమాలేంటంటే..

 గీతాంజలి మళ్ళీ వచ్చింది: ఆహా

Don't miss these 4 movies coming to OTT this week

అంజలి మెయిన్ లీడ్ లో నటించిన గీతాంజలి మూవీ కి మంచి పేరు రావడంతో.. దానికి సిక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాను రూపొందించారు మేకర్స్. ఈ సినిమా థియేటర్ లో మిక్సడ్ టాక్ సంపాదించుకుంది. మే 8 నుంచి ఈ సినిమా ఆహ ఓటీటీ లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. థియేటర్ లో ఈ సినిమాను కనుక ఎవరైనా మిస్ అయ్యి ఉంటే వెంటనే చూసేయండి.

 చిత్రం చూడరా: ఈటీవీ విన్

Don't miss these 4 movies coming to OTT this week 01

వరుణ్ సందేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా… నేరుగా ఓటీటీ లోనే విడుదల అవ్వబోతుంది. పోలీసులను ఎదురించే ఓ యువకుడి కథ ఇది . నేరుగా ఓటీటీ లో రిలీజ్ అయ్యే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. మరి ఈ సినిమా ఏ మేరకు ప్రేక్షకులను మెప్పించనుందో వేచి చూడాలి. ఈ సినిమా మే 9 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది.

 ఆవేశం: అమెజాన్ ప్రైమ్

Don't miss these 4 movies coming to OTT this week 02

ఫహద్ ఫాజిల్ నటించిన ఈ సినిమా గురించి.. ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి బజ్ నడుస్తుంది. థియేటర్ లో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా మే 9 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను థియేటర్ లో మిస్ అయిన వారు ఎంచక్కా ఓటీటీ లో చూసేయండి.

 పార్ధు : ఈటీవీ విన్

Don't miss these 4 movies coming to OTT this week 03

తమిళ సినిమా ఓమై సెన్నై సినిమాకు తెలుగు డబ్ వెర్షన్ గా పార్ధు సినిమా.. ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సినిమా 2021లో థియేటర్ లో రిలీజ్ అయ్యి.. ఓ మంచి సైకో థ్రిల్లర్ మూవీ గా ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి. మే 9 నుంచి ఈ సినిమా ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.

ఇక ఈ సినిమాలతో పాటు.. ఉందేకి సీజన్ 3, మర్డర్ ఇన్ మాహిమ్, 8 ఏఎం మెట్రో లాంటి ఎన్నో సినిమాలు ఓటీటీ లో ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ సినిమాలను అసలు మిస్ అవ్వకుండా చూసేయండి. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి