Somesekhar
ఐపీఎల్ 2024 స్టార్టింగ్ కు ముందు ముంబై ఇండియన్స్ కు భారీ ఎదురుదెబ్బతగిలింది. 2023 వన్డే వరల్ట్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటాగాడు గాయం కారణంగా టోర్నీలో సగం మ్యాచ్ లకు దూరం కానున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు?
ఐపీఎల్ 2024 స్టార్టింగ్ కు ముందు ముంబై ఇండియన్స్ కు భారీ ఎదురుదెబ్బతగిలింది. 2023 వన్డే వరల్ట్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటాగాడు గాయం కారణంగా టోర్నీలో సగం మ్యాచ్ లకు దూరం కానున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు?
Somesekhar
ఇప్పటికే హార్దిక్ పాండ్యా వర్సెస్ రోహిత్ శర్మ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ తో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే ఉంది. ఈ క్రమంలో గాయాలు పలు ఫ్రాంచైజీలకు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. తాజాగా ముంబై టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. 2023 వన్డే వరల్ట్ కప్ లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటాగాడు గాయం కారణంగా టోర్నీలో సగం మ్యాచ్ లకు దూరం కానున్నాడు. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ వివరాల్లోకి వెళితే..
ఐపీఎల్ 2024 ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ టీమ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ప్లేయర్, శ్రీలంక ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్ తొలి భాగానికి దూరం కానున్నాడని సమాచారం. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన మధుశంక ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతడికి స్కాన్ చేయగా, గాయం తీవ్రమైందని, అతడు కోలుకోవడానికి దాదాపు 3 వారాల సమయం పట్టనున్నట్లు శ్రీలంక క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. ఇదే నిజమైతే.. ఐపీఎల్ తొలిదశకు మధుశంక దూరమైయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా.. మధుశంక వన్డే వరల్డ్ కప్ 2023లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఆ మెగాటోర్నీలో 21 వికెట్లు తీసి టాప్ ఫైవ్ లో నిలిచాడు. ఈ ప్రదర్శనను పరిగణలోకి తీసుకున్న ముంబై అతడిని ఐపీఎల్ మినీ వేలంలో రూ. 4.6 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో తమ బౌలింగ్ లైనప్ ను స్ట్రాంగ్ చేసుకున్నామని అనుకునే లోపే అతడికి గాయం కావడం ఎంఐకి పెద్ద దెబ్బ. అయితే అతడి ప్లేస్ ను ఏ ప్లేయర్ తో రీప్లేస్ చేస్తుందో ఇంకా తెలియరాలేదు. మరి మధుశంక దూరం కాడవం ముంబైకి నష్టమేనా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dilshan Madushanka is out of the third ODI against Bangladesh and the initial stages of #IPL2024 due to a hamstring injury
The left-arm quick was picked up by MI for INR 4.6 crore at the auction pic.twitter.com/HPy08N3Gbk
— ESPNcricinfo (@ESPNcricinfo) March 17, 2024
ఇదికూడా చదవండి: ధోనికి రుణపడి ఉంటా.. రవిచంద్రన్ అశ్విన్ ఎమోషనల్!