iDreamPost

ధోనికి రుణపడి ఉంటా.. రవిచంద్రన్ అశ్విన్ ఎమోషనల్!

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి జీవితాంతం రుణపడి ఉంటానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. మరి ధోనికి అశ్విన్ ఎందుకు రుణపడి ఉంటానని చెప్పాడు? అతడికి ధోని చేసిన సాయం ఏంటి?

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి జీవితాంతం రుణపడి ఉంటానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు రవిచంద్రన్ అశ్విన్. మరి ధోనికి అశ్విన్ ఎందుకు రుణపడి ఉంటానని చెప్పాడు? అతడికి ధోని చేసిన సాయం ఏంటి?

ధోనికి రుణపడి ఉంటా.. రవిచంద్రన్ అశ్విన్ ఎమోషనల్!

ఇటీవలే టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మనస్తత్వం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచాడు టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్. తన అమ్మ ఆస్పత్రిలో ఉన్నప్పుడు రోహిత్ చేసిన సాయాన్ని జీవితంలో మర్చిపోలేనని ఆ సందర్భంగా చెప్పుకొచ్చాడు ఈ స్టార్ స్పిన్నర్. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనికి జీవితాంతం రుణపడి ఉంటానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మరి ధోనికి అశ్విన్ ఎందుకు రుణపడి ఉంటానని చెప్పాడు? అతడికి ధోని చేసిన సాయం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

రవిచంద్రన్ అశ్విన్.. ఇటీవల ఇంగ్లండ్ తో ముగిసిన టెస్ట్ సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. తద్వారా టీమిండియా సిరీస్ విజయానికి కారణమైయ్యాడు. ఇక ఈ టెస్ట్ సిరీస్ ద్వారా 100 టెస్టులు ఆడిన క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కడంతో పాటుగా 500 వికెట్ల క్లబ్ లో చేరాడు అశ్విన్. ఈ సందర్భంగా అశ్విన్ ను ఘనంగా సన్మానించింది తమిళనాడు క్రికెట్ సంఘం(TNCA). ఈ సన్మాన కార్యక్రమంలో భాగంగా.. అశ్విన్ తన కెరీర్ తొలినాళ్లలో ధోని తనకు చేసిన సాయం గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యాడు.

అశ్విన్ మాట్లాడుతూ..”2011 ఐపీఎల్ ఫైనల్లో ధోని నాకు బంతిని ఇచ్చి.. తొలి ఓవరే క్రిస్ గేల్ లాంటి డేంజరస్ బ్యాటర్ కు బౌలింగ్ చేయమన్నాడు. 4వ బంతికే నేను గేల్ వికెట్ తీశాను. ఇప్పటికీ చాలా మంది దానిగురించి మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం ధోనినే. నాకు ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లోనే ధోని నాకు అండగా నిలిచాడు. అవకాశాలు కల్పించాడు. ప్రస్తుతం నేను ఈ స్టేజ్ లో ఉండటానికి కారణం అతడే. అందుకే ధోనికి జీవితాంతం రుణపడి ఉంటాను” అంటూ చెప్తూ భావోద్వేగానికిగురైయ్యాడు ఈ వెటరన్ స్పిన్నర్.

తమిళనాడు క్రికెట్ సంఘం నాకు ఎంతో గౌరవం కల్పించింది.. అందుకు వారికి ధన్యవాదాలు. అందుకే క్లబ్ క్రికెట్ ఆడేందుకు నేను ఎప్పుడూ సిద్దంగా ఉంటానని అశ్విన్ పేర్కొన్నాడు. ఒకేవేళ నేను చచ్చిపోయినా నా ఆత్మ ఈ స్టేడియంలోనే తిరుగుతూ ఉంటుందని ఎమోషనల్ అయ్యాడు అశ్విన్. ఈ కార్యక్రమంలో అతడికి ప్రత్యేక బహుమతిగా సెంగోల్ ను అందించారు. దాంతో పాటుగా అశ్విన్ పేరుతో స్టాంప్ ను విడుదల చేశారు. రూ. కోటి నగదు పురస్కారాన్ని కూడా అందించారు.

ఇదికూడా చదవండి: WPL ఫైనల్.. DC vs RCB టైటిల్ కొట్టేదెవరంటే? బలాలు-బలహీనతలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి