iDreamPost

కరోనాకు ఉచిత చికిత్స చేయమన్న పిటిషనర్ కు రూ.5 లక్షల జరిమానా

కరోనాకు ఉచిత చికిత్స చేయమన్న పిటిషనర్ కు రూ.5 లక్షల జరిమానా

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కరోనా రోగులకు ఉచిత వైద్యం అందించాలని కోరినందుకు ముంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ…తిరిగి పిటిషనర్ కు జరిమానా విధించింది.

మహారాష్ట్రలోని కరోనా పేషెంట్స్ అందరికీ ఉచితంగా చికిత్స అందించాలంటూ పిటిషన్ వేసిన వ్యక్తిపై ముంబాయి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ డిమాండ్ అర్థరహితంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతేకాదు పిటిషనర్ కు రూ. 5 లక్షల జరిమానా విధించింది.

నెల వ్యవధిలో ప్రభుత్వ ఖాతాలో ఈ మొత్తాన్ని జమ చేయాలని ఆదేశించింది. ఈ పిటిషన్ ను ప్రముఖ విద్యావేత్త సాగర్ జోంధాలే దాఖలు చేశారు. కరోనాను ఆసరాగా తీసుకుని ప్రైవేటు ఆసుపత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయని…ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని కరోనా బాధితులందరికీ ఉచితంగా చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ ను హైకోర్టు కోర్టు తప్పుపడుతూ పిటిషనర్ పై ఆగ్రహం వ్యక్తం ‌చేసింది. పిటిషన్ ను తిరస్కరిస్తూ పిటిషనర్ కు జరిమానా విధించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి