iDreamPost
android-app
ios-app

ఇది తోడేళ్ల ముఠాకు, సింహానికి మధ్య పోరాటం: విజయసాయి రెడ్డి

  • Author singhj Published - 04:10 PM, Fri - 15 September 23
  • Author singhj Published - 04:10 PM, Fri - 15 September 23
ఇది తోడేళ్ల ముఠాకు, సింహానికి మధ్య పోరాటం: విజయసాయి రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్​తో ఏపీలో రాజకీయ వాతావరణం హీటెక్కింది. పాలిటిక్స్​లో 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన బాబు అరెస్ట్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఆయన అరెస్ట్​తో ఏపీ పాలిటిక్స్​లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. స్కిల్ డెవలప్​మెంట్ స్కామ్​లో భాగంగా రాష్ట్ర మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ ఏసీబీ కోర్టు 14 రోజలు జ్యుడీషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్​లో ఖైదీగా ఉన్నారు. ఇదే టైమ్​లో బాబు మీద గతంలో నమోదైన కేసులు మరోమారు తెర పైకి వస్తున్నాయి.

అవినీతి కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి మద్దుతునిచ్చారు. చంద్రబాబుతో ములాఖత్ అనంతరం బయటకు వచ్చిన పవన్.. లోకేష్, బాలకృష్ణతో కలసి మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎలక్షన్స్​లో టీడీపీ-జనసేత పొత్తు ఉంటుందని, రెండు పార్టీలు కలసి ముందుకు వెళ్తాయని స్పష్టం చేశారు. టీడీపీతో పవన్ పొత్తు పెట్టుకోవడం, ఆ తర్వాత చేసిన పలు వ్యాఖ్యలపై అధికార వైసీపీ నేతలు మండిపడుతున్నారు. పవన్ ప్యాకేజీ కోసం జనసేన కార్యకర్తల్ని తాకట్టు పెట్టాడని మంత్రి రోజా విమర్శించారు.

స్కిల్ స్కామ్​లో చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, ఆ తర్వాత పవన్ టీడీపీతో పొత్తు ప్రకటన నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఏపీలో రానున్న ఎన్నికల పైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తోడేళ్ల ముఠాకు, సింహానికి మధ్య పోరాటమన్నారు. తోడేళ్ల ముఠాతో సింహం తలపడుతోందన్నారు. వచ్చే ఎలక్షన్స్ దురాశ, ప్రజాసంక్షేమం మధ్య ఉండబోతున్నాయని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. కుల రాజకీయాలు, ఐక్యత మధ్య పోరు జరగనుందన్నారు. అవకాశవాదం, నిజాయితీ మధ్యే ఎన్నికలు జరగనున్నాయని విజయసాయి రెడ్డి తన ట్వీట్​లో రాసుకొచ్చారు.

ఇదీ చదవండి: జనసేన కార్యకర్తలను పవన్ తాకట్టు పెట్టాడు: మంత్రి రోజా