iDreamPost

ఈ పిల్లాడు.. స్టార్ హీరో అయ్యాడు.. కానీ ఎందుకు చనిపోయాడో ఎవరికీ తెలియదు

ఈ ఫోటోలోని పిల్లాడు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాతో హిట్ అందుకున్నాడు. కానీ అనూహ్యంగా చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చనిపోయాడో ఎవరికీ తెలియదు. ఇంతకు అతడు ఎవరంటే..?

ఈ ఫోటోలోని పిల్లాడు ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. తొలి సినిమాతో హిట్ అందుకున్నాడు. కానీ అనూహ్యంగా చిన్న వయస్సులో ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చనిపోయాడో ఎవరికీ తెలియదు. ఇంతకు అతడు ఎవరంటే..?

ఈ పిల్లాడు.. స్టార్ హీరో అయ్యాడు.. కానీ ఎందుకు చనిపోయాడో ఎవరికీ తెలియదు

సాధారణంగా హీరోలకు అభిమానులు ఉంటారు. అయితే చాలా తక్కువ మంది యాక్టర్స్‌కు మాత్రమే లేడీ ఫ్యాన్స్ ఉంటారు. కుటుంబ కథా చిత్రాలతో అలరించారు కాబట్టే విక్టరీ వెంకటేశ్‌ను మహిళలు ఎక్కువగా అభిమానిస్తుంటారు. ఆయనకు ఉమెన్ ఫ్యాన్స్ ఎక్కువ. కానీ ప్రేమ కథా చిత్రాలతో ఆడ పిల్లల మనస్సు దోచేశారు కొంత మంది కుర్ర హీరోలు. ఇప్పుడే కాదు..ఒకప్పటి హీరో హరినాథ్ తరం నుండే లేడీ ఫ్యానిజం మొదలైంది. అప్పట్లో ఈ హీరోకు ఎక్కువ మంది అమ్మాయిలు అభిమానులుగా ఉండేవారట. ఇదిగో ఈ ఫోటోలో ఉన్న పిల్లాడు కూడా ..చాలా మంది గర్ల్స్‌కు క్రష్ హీరో. తొలి సినిమాతో భారీ హిట్ కొట్టి.. ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్ అందుకుని.. ఇండస్ట్రీని షేక్ చేశాడు. కానీ ఆ తర్వాత పేలవమైన కథలతో వెనకబడ్డాడు.

ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లాడు.. ఒకప్పుడు స్టార్ హీరో. అతడితో సినిమాలు చేసేందుకు క్యూ కట్టేవారు. తెరపై అతడు కనిపిస్తే చాలు.. అమ్మాయిల కలల రాకుమారుడు. డ్రీమ్ అండ్ లవర్ బాయ్. ఇట్లాంటి బాయ్ ఫ్రెండ్ కోరుకునే వారు. అతడి సినిమాల కోసం యువతులు క్యూ కట్టేవారు. కానీ కొన్ని కథలను ఎంపిక చేసుకోవడంలో తడబడి.. ఎంతటి స్టార్ డమ్ చూశాడో.. అంత ఫెయిల్యూర్‌ను కూడా ఎదుర్కొన్నాడు. చివరకు వ్యక్తిగతంగా కూడా కొన్ని సమస్యలు వెంటాడుతుండటంతో చిన్న వయస్సులోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి మరణాన్ని ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు లేడీ ఫ్యాన్స్. ఇంత చెప్పాక.. అతడో ఎవరో గుర్తు పట్టేశారు కదా.. నన్ అదర్ దెన్ లవర్ బాయ్ ఉదయ్ కిరణ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా 20 ఏళ్లకే హీరోగా మారి.. 33 ఏళ్లకే తనువు చాలించాడు. ఈ రోజు అతడి జయంతి.

చిత్రం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్.. నువ్వు నేనుతో లవర్ బాయ్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. మనసంతా నువ్వేతే అమ్మాయిలకు క్రష్ హీరోగా అవతరించాడు. కలుసుకోవాలని, శ్రీరామ్, హోలీ, నీ స్నేహం వంటి చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగాడు. ఆ నాటి అమ్మాయిలు ఇతడంటే పడి చచ్చిపోయే వాళ్లు. ఇంట్లో కూడా అతడి ఫోటోలు పెట్టుకుని ఆరాధించేవారు. దీంతో అతడితో సినిమాలు చేసేందుకు ఊవిళ్లూరారు దర్శక నిర్మాతలు. జోడీ నంబర్ 1 చిత్రం నుండి అతడి కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ సోసో అనిపించుకోవడమే లేదంటే.. డిజాస్టర్ అయ్యేవి. తెలుగే కాదు తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. అక్కడ కూడా చుక్క ఎదురైంది. 2012లో విషిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత రెండేళ్లకే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు చనిపోయాడో ఇప్పటికీ అసలైన కారణం తెలియదు.  అతడు మరణించడం తట్టుకోలేక పోయారు ఆడియన్స్. కన్నీటి పర్యంత అయ్యారు. అతడు హీరోగా నటించిన చివరి చిత్రం.. చిత్రం చెప్పిన కథ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి