iDreamPost
android-app
ios-app

రోహిత్, కోహ్లీ కాదు.. భారత క్రికెట్​లో అతడే అందరికంటే పవర్​ఫుల్!

  • Published Feb 29, 2024 | 6:15 PM Updated Updated Mar 01, 2024 | 2:55 PM

టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పవర్​ఫుల్ అనుకుంటాం. కానీ భారత క్రికెట్​లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియాలో కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పవర్​ఫుల్ అనుకుంటాం. కానీ భారత క్రికెట్​లో అత్యంత శక్తిమంతమైన వ్యక్తి మరొకరు ఉన్నారు. ఆయన ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Feb 29, 2024 | 6:15 PMUpdated Mar 01, 2024 | 2:55 PM
రోహిత్, కోహ్లీ కాదు.. భారత క్రికెట్​లో అతడే అందరికంటే పవర్​ఫుల్!

టీమిండియాలో పవర్​ఫుల్ ఎవరంటే ప్రతి ఒక్కరు ఇద్దరి పేర్లే చెబుతారు. ఒకరు రోహిత్ శర్మ, మరొకరు విరాట్ కోహ్లీ. బ్యాట్​తో అదరగొడుతూనే కెప్టెన్సీలోనూ రాణిస్తూ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు హిట్​మ్యాన్. బ్యాటర్​గా, కెప్టెన్​గా జట్టుపై అతడి ఆధిపత్యం నడవడంలో తప్పు లేదు. ఇక, స్టార్ బ్యాట్స్​మన్ కోహ్లీ తన ఎక్స్​పీరియెన్స్​తో టీమ్​ సక్సెల్​లో కీలకంగా మారుతున్నాడు. బ్యాట్​తో చెలరేగుతూ ఆపదలో నుంచి జట్టును గట్టెక్కిస్తున్నాడు. సూపర్ ఫామ్​లో ఉన్న కోహ్లీ పరుగుల వరద పారిస్తూ టీమిండియాపై తనదైన ముద్ర వేశాడు. దీంతో వీళ్లిద్దరే టీమ్​కు మెయిన్ పిల్లర్స్​గా, ఇండియన్ క్రికెట్​లో తోపులుగా కొనసాగుతున్నారు. అయితే భారత క్రికెట్​లో రోహిత్, కోహ్లీ కాదు.. మరో వ్యక్తి పవర్​ఫుల్ అని తేలింది. అసలు ఆ వ్యక్తి ఎవరు? అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం..

దేశంలోని మోస్ట్ పవర్​ఫుల్ ఇండియన్స్-2024 జాబితాలో బీసీసీఐ సెక్రటరీ జై షా 35వ స్థానంలో నిలిచారు. భారత క్రికెట్ నుంచి ఈ లిస్టులో విరాట్ కోహ్లీ (38) షా తర్వాతి ప్లేసులో నిలిచాడు. లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని 58వ స్థానాన్ని దక్కించుకోగా.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 68వ ప్లేసులో నిలిచాడు. ఈ జాబితా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జై షాకు పెరుగుతున్న పాపులారిటీని చూసి అంతా షాకవుతున్నారు. మోస్ట్ పవర్​ఫుల్ ఇండియన్స్ లిస్టులో కోహ్లీ, ధోని, రోహిత్​ను షా దాటేయడంపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. జై షా డామినేషన్​కు ఇది ప్రూఫ్​ అని కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ కంటే భారత క్రికెట్​లో తానే పవర్​ఫుల్ అని ఆయన ప్రూవ్ చేశాడని అంటున్నారు. అయితే ఈ లిస్టులో టాప్​లో రానంత మాత్రాన కోహ్లీ, రోహిత్​ తక్కువేమీ కాదని.. వాళ్లకు ఉన్న ఫ్యాన్ బేస్, ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువేనని వ్యాఖ్యానిస్తున్నారు.

భారత క్రికెట్ జట్టుకు రోహిత్, కోహ్లీలు ఆయువుపట్టు లాంటి వారని.. మోస్ట్ పవర్​ఫుల్ ఇండియన్స్ లిస్టులో టాప్​లో రానంత మాత్రాన వారికి పోయేదేమీ లేదని నెటిజన్స్ అంటున్నారు. అయితే జై షాకు పెరుగుతున్న ఆదరణ, బీసీసీఐలో ఆయన హవా నడిపిస్తుండటం, భారత క్రికెట్ బోర్డుకు అన్నీ తానై వ్యవహరిస్తుండటం వల్లే ఆ జాబితాలో ఆయన పై వరుసలో ప్లేస్ దక్కించుకున్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, మోస్ట్ పవర్​ఫుల్ ఇండియన్స్-2024లో ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తర్వాతి ప్లేసుల్లో వరుసగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఉన్నారు.

ఇదీ చదవండి: కోహ్లీని తప్పించి రోహిత్‌కి కెప్టెన్సీ! కారణం చెప్పిన గంగూలీ