iDreamPost

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్​పై ఎఫ్​​ఐఆర్ నమోదు! ఎందుకంటే..?

  • Author singhj Updated - 10:22 AM, Fri - 24 November 23

వన్డే వరల్డ్ కప్-2023 నెగ్గిన సంతోషంలో ఉన్న ఆస్ట్రేలియాకు షాక్. ఆ దేశ క్రికెటర్​పై ఎఫ్​ఐఆర్ నమోదైంది. అసలు ఆ ఎఫ్​ఐఆర్ ఎందుకు నమోదైందంటే..!

వన్డే వరల్డ్ కప్-2023 నెగ్గిన సంతోషంలో ఉన్న ఆస్ట్రేలియాకు షాక్. ఆ దేశ క్రికెటర్​పై ఎఫ్​ఐఆర్ నమోదైంది. అసలు ఆ ఎఫ్​ఐఆర్ ఎందుకు నమోదైందంటే..!

  • Author singhj Updated - 10:22 AM, Fri - 24 November 23
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్​పై ఎఫ్​​ఐఆర్ నమోదు! ఎందుకంటే..?

వరల్డ్ కప్-2023 ఒక్కో జట్టుకు ఒక్కో రకమైన అనుభూతిని ఇచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్​కు మాత్రం మిక్స్​డ్ ఎమోషన్స్​ను మిగిల్చింది. సెమీస్​కు చేరకుండానే బయటకు వెళ్లిపోయిన ఇంగ్లండ్, పాకిస్థాన్, శ్రీలంక లాంటి బడా టీమ్స్ తమ అభిమానులను పూర్తిగా నిరాశపర్చాయి. అందుకే ఆయా జట్లను ప్రక్షాళన చేస్తున్నాయి క్రికెట్ బోర్డులు. మెగా టోర్నీలో పాక్ ఫెయిల్యూర్​కు బాధ్యతగా చీఫ్ సెలక్టర్ ఇంజమాముల్ హక్, బౌలింగ్ కోచ్ మోర్నె మోర్కెల్, కెప్టెన్ బాబర్ ఆజం తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. మిగిలిన కోచింగ్ స్టాఫ్​ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) స్వయంగా తప్పించింది. టీ20, టెస్టులకు కొత్త కెప్టెన్లను నియమించిన పాక్ బోర్డు.. చీఫ్ సెలక్టర్, క్రికెట్ టీమ్ డైరెక్టర్ పోస్టులకు కూడా కొత్త వారిని తీసుకుంది.

ప్రపంచ కప్​లో చెత్తాట ఆడినందుకు శ్రీలంక క్రికెట్​లో ముసలం రేగింది. భారత్​పై ఓటమి, వరుస పరాజయాల కారణంగా అక్కడి క్రికెట్ బోర్డును ఆ దేశ ప్రభుత్వం రద్దు చేసింది. అంతేగాక సీనియర్ ప్లేయర్ అర్జున రణతుంగ నేతృత్వంలో కొత్త కమిటీని నియమించింది. అయితే క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో ఇలా దేశ సర్కారు కలుగజేసుకోవడం నచ్చని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) లంక క్రికెట్​ను బ్యాన్ చేసింది. ఆ దేశం నుంచి అండర్-19 వరల్డ్ కప్​ను సౌతాఫ్రికాకు తరలించింది ఐసీసీ. ఇక, భారత క్రికెట్​లోనూ ప్రపంచ కప్ వల్ల కొన్ని మార్పులు చోటుచేసుకోవడం తప్పేలా లేదు. కోచ్ పదవితో పాటు కెప్టెన్.. ఇతర పోస్టులు కూడా మారే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.

ఇక, వరల్డ్ కప్ నెగ్గిన ఆస్ట్రేలియా మాత్రం సంతోషంలో మునిగిపోయింది. ప్రతిష్టాత్మక కప్పును ఆరోసారి చేజిక్కించుకోవడంతో ఆ దేశ క్రికెటర్లు, ఫ్యాన్స్ ఆనందానికి హద్దే లేకుండా పోయింది. ఇప్పటికే కప్పును తీసుకొని ఆసీస్ బడా ప్లేయర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. అయితే స్టీవ్ స్మిత్, మార్కస్ స్టొయినిస్ లాంటి ఇద్దరు, ముగ్గురు ఆటగాళ్లు మాత్రం భారత్​తో జరుగుతున్న టీ20 సిరీస్​ కోసం ఇక్కడే ఉండిపోయారు. ఈ తరుణంలో కంగారూ క్రికెట్​కు ఓ షాకింగ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ఆల్​రౌండర్ మిచెల్ మార్ష్​ మీద కేసు నమోదైంది. ప్రపంచ కప్ ట్రోఫీపై అతడు కాళ్లు పెట్టి దిగిన ఫొటో వైరల్ అయిన సంగతి తెలిసిందే.

వరల్డ్ కప్​పై మార్ష్ కాళ్లు పెట్టాడని ఇండియాకు చెందిన ఆర్టీఐ కార్యకర్త పండిట్ కేశవ్ ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​ పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ట్రోఫీపై ఇలా కాళ్లు పెట్టి భారత క్రికెట్ ఫ్యాన్స్ మనోభావాలను ఆసీస్ ప్లేయర్ దెబ్బతీశాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడు ఇండియాలో ఆడకుండా నిషేధం విధించాలని చెబుతూ కంప్లయింట్ కాపీని ప్రధాని నరేంద్ర మోడీకి కూడా పంపడం గమనార్హం. ఈ ఎఫ్​ఐఆర్ గురించి తెలిసిన ఇండియన్ ఫ్యాన్స్ కేశవ్​కు సపోర్ట్ చేస్తున్నారు. కప్పు విలువ తెలియని వారే ఇలా చేస్తారని.. తాను చేసిన తప్పుకు మార్ష్​కు శిక్ష పడాల్సిందేనని చెబుతున్నారు. ఇకనైనా దేనికి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నేర్చుకోండని సీరియస్ అవుతున్నారు. మరి.. ఆసీస్ క్రికెటర్​పై ఎఫ్​ఐఆర్ నమోదు అవ్వడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఆసీస్ స్టార్ బ్యాటర్లను వణికించిన టీమిండియా పేసర్! ఆ ఓవర్లో..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి