iDreamPost

ఆసీస్ స్టార్ బ్యాటర్లను వణికించిన టీమిండియా పేసర్! ఆ ఓవర్లో..

  • Author Soma Sekhar Published - 10:02 PM, Thu - 23 November 23

టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లందరూ భారీగా రన్స్ సమర్పించుకున్నారు. కానీ ఒకే ఒక్క బౌలర్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి.. స్టార్ బ్యాటర్లను వణికించాడు.

టీమిండియాతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లందరూ భారీగా రన్స్ సమర్పించుకున్నారు. కానీ ఒకే ఒక్క బౌలర్ మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేసి.. స్టార్ బ్యాటర్లను వణికించాడు.

  • Author Soma Sekhar Published - 10:02 PM, Thu - 23 November 23
ఆసీస్ స్టార్ బ్యాటర్లను వణికించిన టీమిండియా పేసర్! ఆ ఓవర్లో..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియా భారీ స్కోర్ సాధించింది. విశాఖపట్నం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు తేలిపోయారు. ఆసీస్ బ్యాటర్లు చెలరేగడంతో.. దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. కానీ ఓ బౌలర్ మాత్రం ప్రత్యర్థి స్టార్ బ్యాటర్లను తన బౌలింగ్ తో ఇబ్బందులకు గురిచేశాడు. అతడే ముకేశ్ కుమార్. తన బౌలింగ్ తో టిమ్ డేవిడ్, స్టోయినిస్ లను వణికించాడు. దీంతో ఆసీస్ మరింత భారీ స్కోర్ చేయకుండా తనవంతు ప్రయత్నం చేశాడు. చివరి ఓవర్ అద్భుతంగా వేసిన ముకేశ్ కుమార్ అతి తక్కువ పరుగులు సమర్పించుకున్నాడు.

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టీ20లో ఆసీస్ భారీ స్కోర్ సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కంగారూ టీమ్.. 3 వికెట్ల నష్టానికి 208 పరుగుల చేసింది. జట్టులో థండర్ ఇన్నింగ్స్ తో మెరిశాడు జోష్ ఇంగ్లీస్. కేవలం 47 బంతుల్లోనే శతకం చేసి.. ఔరా అనిపించాడు. ఓవరాల్ గా 50 బంతులు ఎదుర్కొన్న అతడు 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 110 పరుగులు చేశాడు. అతడికి తోడుగా స్టీవ్ స్మిత్ 52 రన్స్ తో రాణించాడు. వీరిద్దరి తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన స్టోయినిస్ (7*), టిమ్ డేవిడ్ (19*) పరుగులు మాత్రమే చేశారు. స్టార్ బ్యాటర్లుగా ముద్రపడ్డ వీరు చివరి ఓవర్లో చేసిన పరుగులు చూస్తే.. షాక్ తినాల్సిందే. పరుగుల వరద పారిస్తున్న ఆసీస్ బ్యాటర్లను అద్భుతంగా కట్టడి చేశాడు టీమిండియా యువ పేసర్ ముకేశ్ కుమార్. అతడు తన 4 ఓవర్ల కోటాలో కేవలం 29 రన్స్ మాత్రమే ఇచ్చాడు. మిగతా బౌలర్లు అందరూ దారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.

ఇక ముకేశ్ వేసిన లాస్ట్ ఓవర్ ఈ మ్యాచ్ కే హైలైట్ అని చెప్పాలి. స్టోయినిస్, టిమ్ డేవిడ్ లాంటి భీకర బ్యాటర్లను ఈ ఓవర్లో వణికించాడు ముకేశ్. అద్బుతమైన బౌలింగ్ తో కేవలం 5 రన్స్ మాత్రమే ఇచ్చాడు ఆఖరి ఓవర్లో. టీ20 మ్యాచ్.. అది కూడా ఆఖరి ఓవర్లో 5 రన్స్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. కాగా.. 209 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ లోనే రుతురాజ్ గైక్వాడ్ (0) రనౌట్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాత జైస్వాల్ (21) కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయాడు. దీంతో 22 రన్స్ కే 2 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ లో రెచ్చిపోయి ఆడుతున్నారు. సూర్య తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. వీరిద్దరు ఆసీస్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు సాధిస్తున్నారు. ఇషాన్(58) పరుగులు చేేసి సంగా బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. సూర్య కుమార్(48) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి