iDreamPost

థియేటర్లో ఫెయిల్‌.. నెల తిరక్కుండానే OTTలోకి స్టార్‌ హీరో సినిమా

  • Published Jan 25, 2024 | 9:11 AMUpdated Jan 25, 2024 | 9:11 AM

Merry Christmas-OTT Streaming Date: సంక్రాంతి సందర్భంగా థియేటర్లో విడుదలైన ఓ స్టార్‌ హీరో సినిమా నెల రోజులు కూడా గడవక ముందే.. ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ వివరాలు..

Merry Christmas-OTT Streaming Date: సంక్రాంతి సందర్భంగా థియేటర్లో విడుదలైన ఓ స్టార్‌ హీరో సినిమా నెల రోజులు కూడా గడవక ముందే.. ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ వివరాలు..

  • Published Jan 25, 2024 | 9:11 AMUpdated Jan 25, 2024 | 9:11 AM
థియేటర్లో ఫెయిల్‌.. నెల తిరక్కుండానే OTTలోకి స్టార్‌ హీరో సినిమా

ఓటీటీల హవా రోజు రోజుకు పెరుగుతుంది. కరోనా సంక్షోభం నుంచి ఓటీటీలు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాయి. సబ్‌ టైటిల్స్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉండటంతో.. భాషతో సంబధం లేకుండా.. అన్నీ చిత్రాలను చూసేస్తున్నారు ప్రేక్షకులు. జనాలు ఓటీటీలకు ఎంతలా అలవాటు పడ్డారంటే.. కొత్త సినిమా రిలీజైతే ఒకప్పుడు కచ్చితంగా థియేటర్లో చూడాల్సిన పరిస్థితి. మరి ఇప్పుడు.. ఓ నెల రోజులు ఓపిక పడితే.. ఎంచక్కా ఇంట్లోనే ఎలాంటి డిస్ట్రబెన్స్‌ లేకుండా చూడొచ్చు అనే ఆలోచన పెరిగింది. దాంతో కొన్ని కొత్త సినిమాలు నేరుగా ఓటీటీల్లోనే విడుదలవుతున్నాయి.

ఇక థియేటర్లో విడుదలైన సినిమాలు సైతం నెల రోజుల తర్వాత ఓటీటీల్లో వస్తున్నాయి. ఎంత పెద్ద స్టార్‌ హీరో, డైరెక్టర్‌ సినిమా అయినా సరే.. ఓటీటీల్లో స్ట్రీమ్‌ అవుతున్నాయి. ఇది ప్రేక్షకులకు మంచి అవకాశంగా మారింది. ఈ క్రమంలో తాజాగా థియేటర్లో ఫెయిలైన ఓ స్టార్‌ హీరో సినిమా నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఆ వివరాలు..

merry christmas movie in ott

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సేతుపతి, కత్రినా కైఫ్‌ జంటగా నటించిన మిస్టరీ థ్రిల్లర్‌ సినిమా మెర్రీ క్రిస్మ‌స్ చిత్రం ఇటీవ‌ల థియేట‌ర్ల‌లో రిలీజైంది. అంధాదూన్‌ ఫేమ్‌ శ్రీరాహ్‌ రాఘవన్‌ డైరెక్షన్‌లో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల మందుకు వచ్చింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద చతికిలబడింది. కలెక్షన్లు పెద్దగా రాలేదు కానీ.. విమర్శకులు ప్రశంసలు అందుకుంది.

అయితే విడుదలకు ముందే మెర్రీ క్రిస్మస్‌ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. రూ.60 కోట్లకు ఈ సినిమా ఓటీటీ హక్కులను కొన్నది నెట్‌ఫ్లిక్స్‌. అంతేకాక సినిమా విడుదలైన 30 రోజుల్లోనే స్ట్రీమింగ్‌ చేసుకునేలా ఒప్పందం కుదుర్చుకుందట.దాంతో ఫిబ్రవరి 9న మెర్రీ క్రిస్మస్‌ చిత్రం.. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుందని సమాచారం. ఈ తేదిలో స్ట్రీమింగ్‌ కాకుంటే ఫిబ్రవరి 16న కచ్చితంగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంతవరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మెర్రీ క్రిస్మస్‌ డైరెక్ట‌ర్‌ శ్రీరామ్ రాఘ‌వ‌న్‌కు మాస్ట‌ర్ ఆఫ్ స్టోరీ టెల్ల‌ర్‌గా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉంది. అంధాదూన్, బ‌ద్లాపూర్‌ వంటి థ్రిల్లర్‌ కథలతో ఆయన చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పటి వరకు డైరెక్టర్‌ శ్రీరామ్ రాఘ‌వ‌న్‌ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌ కథలే డైరెక్ట్‌ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో మరోసారి అదే జోనర్‌లో మెర్రీ క్రిస్మస్‌ సినిమాను తెరకెక్కించాడు శ్రీరామ్‌. జ‌న‌వ‌రి 12న ఈ మూవీ రిలీజైంది. కానీ గత చిత్రాల మాదిరిగా ఇది ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

మ్యాచ్‌ బాక్స్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి రమేష్ తౌరానీస్ టిప్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో మెర్రీ క్రిస్మస్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్‌తో పాటు సంజయ్ కపూర్, వినయ్ పాఠక్, ప్రతిమ కన్నన్, టిన్నూ ఆనంద్ నటించారు. తమిళ వెర్షన్‌లో రాధికా శరత్‌కుమార్, షణ్ముగరాజా, కెవిన్ జే బాబు, రాజేష్ విలియమ్స్ అదే పాత్రల్లో కనిపించారు. అంతేకాదు.. తెలుగులో కూడా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంటుంది. మరి మనం కూడా ఈ సినిమాను చూసి ఎంజాయ్‌ చేయవచ్చు అన్నమాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి