iDreamPost
android-app
ios-app

నగరంలో ముసుగు దొంగల బీభత్సం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు!

ఈ మధ్య కాలంలో కొందరు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల కొందరు దుండగులు బలవంతంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లి నగలు దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

ఈ మధ్య కాలంలో కొందరు దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల కొందరు దుండగులు బలవంతంగా ఓ ఇంట్లోకి దూసుకెళ్లి నగలు దోచుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారుతోంది.

నగరంలో ముసుగు దొంగల బీభత్సం.. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు!

ఈ మధ్య కాలంలో కొందరు దొంగలు రెచ్చిపోయి ప్రవర్తిస్తున్నారు. గతంలో తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడేవారు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. ఇంట్లో మనుషులు ఉండగానే దొంగతనాలకు పాల్పడుతున్నారు. బలవంతంగా ఇంట్లో దూసుకెళ్లి కత్తులతో బెదిరించి ఇంట్లో ఉన్న నగలు, డబ్బును దోచికెళ్తున్నారు. ఇక పట్టపగలు నగరంలో చైన్ స్నాచింగ్ కూడా పాల్పడుతున్నారు. నగరంలో ఇలాంటి ఘటనలు ఇప్పుడు రోజుకొక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. అయితే, ఈ వరుస చోరీ ఘటనలు మరువకముందే ఇటీవల ఇలాంటిదే మరొకటి చోటు చేసుకుంది. ఇంట్లో ఉన్న మహిళ, ఆమె కూతుళ్లను బెదిరించి చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధిన సీసీ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది? అసలేం జరిగిందంటే?

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు తంజావూరులో ఓ కుటుంబం నివాసం ఉంటుంది. నవంబర్ 26న కార్తీక పౌర్ణమి సందర్భంగా ఓ మహిళ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి బయట దీపాలు వెలిగిస్తుంది. ఇదే సమయంలో ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు వారి ఇంట్లోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. వీరిని గమనించిన ఆ మహిళ, ముగ్గురు అమ్మాయిలు భయంతో ఇంట్లోకి పరుగులు తీశారు. అయినా వదలకుండా ఈ దొంగలు బలవంతంగా ఇంట్లోకి దూసుకెళ్లారు. ఇంతే కాకుండా ఆ మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లపై దాడికి కూడా దిగినట్లు తెలుస్తుంది. దీంతో కత్తి చూపించి చంపేస్తామని బెదిరించి ఇంట్లో ఉన్న నగలు, డబ్బును దోచుకెళ్లినట్లు సమాచారం.

ఇక చేసేదేం లేక ఆ ముగ్గురు ప్రాణ భయంతో ఇంట్లో ఓ మూలన దాక్కున్నారు. ఇక ఆ ముసుగు దొంగలు వచ్చిన పని పూర్తి చేసుకుని వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఈ ముసుగు దొంగల చోరీ ఘటన తీసిన దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. ఇదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారుతోంది. కాగా, ఇటీవల కాలంలో నగరంలో ముసుగు దొంగలు రెచ్చిపోతున్నారని, వారి పట్ల చర్యలు తీసుకోవాలని స్థాని ప్రజలు వాపోతున్నారు. చంపుతామని బెదిరించి ఇంట్లో ఉన్న నగలు, డబ్బు దోచుకెళ్లిన ఈ ముసుగు దొంగల దారుణంపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి