iDreamPost

హోలీ పక్క రోజు అక్కడ వింత ఆచారం! మగవారు ఆడవారి వేషంతో!

దేశ వ్యాప్తంగా హోలీ పండగను అందరు ఎంతో ఉత్సాహం జరుపుకున్నారు. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ రంగుల్లో మునిగితేలుతున్నారు. అలాంటి హోలీ పండగ వేళ.. ఓ గ్రామంలో జంబలకిడి పంబ సీన్లు చూడొచ్చు.

దేశ వ్యాప్తంగా హోలీ పండగను అందరు ఎంతో ఉత్సాహం జరుపుకున్నారు. చిన్న వాళ్ల నుంచి పెద్ద వాళ్ల వరకు అందరూ రంగుల్లో మునిగితేలుతున్నారు. అలాంటి హోలీ పండగ వేళ.. ఓ గ్రామంలో జంబలకిడి పంబ సీన్లు చూడొచ్చు.

హోలీ పక్క రోజు అక్కడ వింత ఆచారం! మగవారు ఆడవారి వేషంతో!

భారతదేశం భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ భిన్నమైన మతాలతో పాటు ఆచార, వ్యవహారాలు ఉంటాయి. అలానే పండగల సమయాల్లో వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన ఆచారాలు జరుగుతుంటాయి. అయితే కొన్ని రకాల సంప్రదాయాలను చూసినప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ముఖ్యంగా  మగవాళ్లు పూర్తిగా ఆడవాళ్లుగా మారి.. దేవుళ్లకు పూజలు చేసే ఆచారాలు కూడా ఉన్నాయి. హోలీ పక్క రోజు ఇలాంటి ఆచారం ఓ గ్రామంలో  జరుగుతుంది. అది ఎక్కడో కాదు.. ఆంధ్రప్రదేశ్ లోనే అలాంటి ఆచారం ఉంది. హాళీ పండగ రోజూ ఓ గ్రామంలోని యువకులు అందరూ అమ్మాయిలుగా మారిపోతారు. మరి.. ఆ స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

సీనియర్ హీరో నరేష్ గురించి మీకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన నటించిన సినిమాల్లో జంబలకిడి పంబ సినిమా ఒకటి. ఈ సినిమా పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది.. ఇందులోని పాత్రలు, సన్నివేశాలు. మగవాళ్లు ఆడవాళ్ల డ్రెస్ లు వేసుకుని  వింతగా ప్రవర్తించడం ఈ సినిమాలో గుర్తొస్తుంది.  కానీ అచ్చం అలాంటి వింతను , విడ్డురాలను ఆచారంగా పాటిస్తున్న గ్రామం ఉందంటే మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుళ్లురూ గ్రామానికి ఈ ప్రత్యేకత ఉంది.

హొలీ పండుగ వచ్చిందంటే పిల్లలు నుండి పెద్దల వరకు రంగులు చల్లుకుని సంబరాలు జరుపుకోవడం చేస్తుంటారు. కానీ సంతేకుళ్లూరు గ్రామంలో మాత్రం హొలీ పండుగను భిన్నంగా జరుపుకుంటారు. ఇక్కడ విచిత్ర వేష ధారణలతో యువకులు పూజలు చేసి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుంది. కామదహనంతో మొదలయ్యే ఈ వేడుకల్లో రెండు రోజులపాటు పండుగ వాతావరణం కనిపిస్తుంది.  హోలీ రోజున పురుషులు మహిళల వేషధారణలోకి మారతారు. చీర కట్టుకుని, పువ్వులు పెట్టుకుని, అలానే ఆభరణాలు సింగారించుకుంటారు. ఆ స్త్రీ వేషధారణతో రతీ మన్మథులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేస్తే తాము కోరిన కోర్కెలు తీరుతాయని ఇక్కడి ప్రజల నమ్మకం. అలానే హోలీ పండుగ రోజు మొక్కుబడి ఉన్న పురుషులు చీరలు ధరించకపోతే అరిష్టం జరుగుతుందనేది వీరి నమ్మకం.

అందుకే ఈ గ్రామంలోని మగాళ్లంతా లుంగీలు తీసేసి కట్టు బొట్టు లంగావోణి, చీరలతో సింగారించుకుని రతీమన్మథులకు పూజలు చేస్తుంటారు. మగువలుగా ముస్తాబైన పురుషులు పిండివంటలు చేసుకుని నైవేద్యంగా తీసుకొని కుటుంబ సభ్యులతో కలిసి తప్పెట్లు, తాళాలతో వీధుల్లో ఆట పాటలతో అందరిని అలరిస్తూ దేవాలయం చేరుకుంటారు. అనంతరం రతి మన్మధులకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆచారం కొన్నేళ్ల నుంచి కొనసాగుతుందని అక్కడి గ్రామస్థులు చెపుతున్నారు. మరి.. ఈ వింత ఆచారంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి