iDreamPost

మాజీ ప్రధాని మన్మోహన్ తాజా ఆరోగ్య పరిస్థితి ఇదే..

మాజీ ప్రధాని మన్మోహన్ తాజా ఆరోగ్య పరిస్థితి ఇదే..

రెండు రోజుల క్రితం అనారోగ్యంతో ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ రోజు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 87 ఏళ్ల మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఆయన హుటాహుటిన ఎయిమ్స్ లో చేరారు. కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ నితీష్ నాయక్ ఆధ్వర్యంలో మన్మోహన్ కు చికిత్స అందించారు. మన్మోహన్ సింగ్ కొలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రముఖులు ప్రజలు కోరుకున్నారు. ఆస్పత్రిలో చేరిన రెండు రోజుల్లోనే తిరిగి ఆయన సంపూర్ణంగా కోల్పోవడంతో వైద్యులు ఈ రోజు డిశ్చార్జ్ చేశారు. 2009లో మన్మోహన్ సింగ్ కు ఎయిమ్స్ లో కొరోనరీ బైపాస్ సర్జరీ జరిగింది.