iDreamPost

సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిన యాజమాన్యం

సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పిన యాజమాన్యం

సింగరేణి కార్మికులకు యాజమాన్యం గుడ్ న్యూస్ చెప్పింది. కార్మికులకు 32 శాతం ఇన్సెంటివ్స్ ను ఇస్తూ తాజాగా ప్రకటన చేసింది. దీంతో సింగరేణి కార్మికులు ముఖాల్లో ఆనందం వెల్లువిరిసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి సంస్థ లాభాల్లో 32 శాతం బోనస్‌గా కార్మికులకు అందించాలని యాజమాన్యం నిర్ణయించింది. 11వ వేజ్ బకాయిలకు సంబంధించి రూ.1450 కోట్లు కార్మికులకు ఖాతాలో జమ చేశారు. దీంతో పాటు దసరా లోపు దీపావళి బోనస్ రూ.700 కోట్లు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

దీన్ని ముందుగానే చెల్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని సింగరేణి డైరెక్టర్ ఎన్.బలరాం తెలిపారు. కాగా, బోనస్ చెల్లింపు విషయంలో కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కార్మికులు ఎవరూ వాటిని నమ్మకూడదని ఆయన సూచించారు. ఈ ప్రకటనతో సింరేణి కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి‌ నుంచి లాభాల్లో కార్మికులకు అందించే వాటాను ప్రతి ఏడాది పెంచుతూ, బొగ్గు గని కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి