iDreamPost

వీడియో: యువకుడి పైత్యం.. భారీ మొసలితో వెకిలి వేషాలు!

వీడియో: యువకుడి పైత్యం.. భారీ మొసలితో వెకిలి వేషాలు!

‘జిహ్మకో రుచి పుర్రెకో బుద్ది’ అన్న చందాన.. ఒక్కోరి ఆలోచనా విధానం ఒక్కోరకంగా ఉంటుంది. కొంతమంది తమను తాము ధైర్యవంతులుగా ఊహించుకుని పిచ్చి పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. తాజాగా, ఓ యువకుడు తనను తాను ఐరన్‌మ్యాన్‌ అనుకున్నాడో.. హల్క్‌ అనుకున్నాడో తెలీదు కానీ, ఏకంగా భారా మొసలితో పిచ్చి వేశాలు వేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే..

ఓ యువకుడు మొసలి ఉన్న నీళ్లలోకి దిగాడు. తన పళ్లతో మాంసం ముక్క పట్టుకుని దానికి తినిపించే ప్రయత్నం చేశాడు. అది ఆ మాంసం ముక్కను పట్టుకోవటానికి వచ్చిన ప్రతీసారి తలపైకి లేపుతూ ఉన్నాడు. అది మాత్రం ఎంతో ఓపిగ్గా దాని కోసం ప్రయత్నించసాగింది. కొద్ది సేపటి తర్వాత అతడు ఆ మాంసం ముక్కను దానికి ఇచ్చేశాడు. అంతటితో ఆగకుండా దాని తల కింద తల పెట్టి ఆటలాడ్డం మొదలుపెట్టాడు. ఆ మొసలి మాత్రం ఏమీ అనకుండా కామ్‌గా ఉండిపోయింది.

కొద్దిసేపటి తర్వాత అతడు అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఇది చూస్తున్న అక్కడి వాళ్లకు మాత్రం జడుసుకుని జ్వరం వచ్చింది. ఇక, వైరల్‌గా మారిన ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నీ అదృష్టం బాగుంది కాబట్టి ప్రాణాలతో బయటపడ్డావు’’.. ‘‘దాని దృష్టిలో నీకు.. నీ నోట్లోని మాంసం ముక్కకు పెద్ద తేడా లేదు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అతడిపై మండిపడుతున్నారు. మరి, ఈ వైరల్‌ వీడియోపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి