iDreamPost

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం.. బుర్ఖా వేసుకుని లేడీస్ టాయిలెట్ లోకి..!

సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిర్వాకం.. బుర్ఖా వేసుకుని లేడీస్ టాయిలెట్ లోకి..!

ఈ మధ్యకాలంలో మానవ రూపంలో ఉండే కామపిశాచాలు ఎక్కువయ్యాయి. ఆడపిల్లలను కనిపిస్తే.. చాలు వారిలోని మృగం నిద్రలేస్తుంది. మరికొందరు.. దొంగచాటుగా మహిళలను వీడియోలు తీసి..బ్లాక్ మెయిలింగ్  పాల్పడుతున్నారు. ప్రైవేటు మాల్స్, హోటల్స్ లో సిక్రెట్ కెమెరాలు పెట్టి.. రహస్యంగా మహిళల వీడియోలు తీసే కేటుగాళ్లు ఎక్కువయ్యారు. ఇలాంటి నేరాలు చేసే వారిలో ఉన్నత చదువులు చదివిన యువకులు కూడా ఉండటం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా బీటెక్ చదివి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడు అలాంటి నీచమైన పనికి పాల్పడ్డి.. చివరకు జైలు పాలయ్యాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం..

కేరళ రాష్ట్రం కొచ్చిలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న ఓ యువకుడు బరి తెగించాడు. ఆ వ్యక్తి బుర్ఖా ధరించి లూలు అనే షాపింగ్ మాల్ లోకి వెళ్లాడు. అక్కడ మహిళల టాయిలెట్ లోకి ప్రవేశించిన అతడు సీక్రెట్ కెమెరాను  పెట్టాడు. వాష్ రూమ్ లోని ఓ చెక్క బోర్డులో  సీక్రెట్ కెమెరాను ఏర్పాటు చేశాడు. ఆ కెమెరాకు సరిగ్గా కనిపించేలా చెక్కకు రంధ్రం చేశాడు. అలా టాయిలెట్ లోపల డోర్ కు సీక్రెట్ కెమెరాను ఫిక్స్ చేశాడు. అనంతరం వాష్ రూమ్ బయటకు వచ్చి నిల్చున్నాడు.

బుర్ఖా ధరించిన వ్యక్తి వాష్ రూమ్ ముందు అటుఇటు తిరుగుతున్నాడు. అతడి ప్రవర్తన  అనుమానస్పదంగా ఉండటాన్ని అక్కడి సిబ్బంది గమనించారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫోన్ చేసి.. సమాచారం ఇచ్చారు. దీంతో వెంటనే అక్కడి చేరుకున్న పోలీసులు బుర్ఖా ధరించిన అదుపులోకి తీసుకున్నారు. బుర్ఖాను తీసి చూడ పురుషుడని తెలింది. దీంతో అతడిని అరెస్ట్ చే సి ఫోన్  స్వాధీనం చేసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 354సీ , 419 , అలానే ఐపీసీ సెక్షన్ 66ఈ కింద  కేసులు నమోదు చేశారు. అంతేకాక అతడి స్థానిక కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.

మాల్ లో కెమెరాలు పెట్టిన విషయం బయటకు రావడంతో స్థానికంగా సంచలనంగా మారింది. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఇలా రహస్య కెమెరాలతో అమ్మాయిల వీడియోలు తీసి.. ఎందరో కేటుగాళ్లు బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డారు. వారి వేధింపులు తట్టుకోలేక పోలీసు కేసులు పెట్టిన వారు కొందరైతే.. ఆత్మహత్య చేసుకున్న వారు మరికొందరు. మరి.. ఇలాంటి మృగాలకు ఎలాంటి శిక్ష విధించాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: బ్రేకింగ్: దూసుకొస్తున్న కార్చిచ్చు! కెనడా నగరం ఖాళీ!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి