iDreamPost
android-app
ios-app

కోడి రెట్టతో కరెంట్ తయారు చేస్తున్న వ్యక్తి!

కోడి రెట్టతో కరెంట్ తయారు చేస్తున్న వ్యక్తి!

కోడి రెట్టతో కరెంట్ తయారీ. నమ్మకశ్యంగా లేకున్న ఇది నిజం. ఓ వ్యక్తి కేవలం కోడి రెట్టతోనే కరెంట్ తయారీ చేస్తూ ఎంతో మంది ఇళ్లల్లో వెలుగులు నింపుతున్నాడు. తన ప్రతిభతో కరెంట్ తయారీ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్న రామెహర్ సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అది హర్యానా ఝజ్జర్ లోని సిలానీ కేషో గ్రామం. ఇదే ఊరిలో రామెహర్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడు గతంలో భారత సైన్యంలో పని చేసి ఆ తర్వాత పదవి విరమణ పొందారు.

అనంతరం రామెహర్ స్థానికంగా ఓ పౌల్ట్రీ ఫారాన్ని ప్రారంభించాడు. అయితే ఇతని గ్రామంలో అనేక కారణాల చేత కరెంట్ ఉండేది కాదు. విద్యుత్ కోసం అనేక సార్లు చాలా మంది అధికారులను సంప్రదించాడు. కానీ, ఎలాంటి ఫలితం దక్కలేదు. ఆ సమయంలో అతనికి ఏం చేయలో అర్థం కాలేదు. అప్పుడే రామెహర్ కు ఓ ఆలోచన తట్టింది. అదే కోడి రెట్టతో కరెంట్ తయారీ. తాను అనుకున్నట్లే చాలా కాలం పాటు శ్రమించిన రామెహర్.. ఎట్టకేలకు అనుకున్నది సాధించి కరెంట్ తయారీ చేశాడు. ఇక అప్పటి నుంచి తన ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మలుచుకున్నాడు. కోడి రెట్టతో తయారు చేసిన కరెంట్ ను తాను వాడుకోవడమే కాకుండా చాలా మందికి విక్రయించేవాడు.

మరో విషయం ఏంటంటే? రామెహర్ దీని కంటే ముందు కోడి రెట్టతో గ్యాస్ కూడా తయారు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇక తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని అతని కుమారులు సైతం ఇతర ప్రాంతాల్లో కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. అయితే రామెహర్ కుటుంబం ప్రస్తుతం 50 కిలో వాట్ల విద్యుత్ ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. కోడి రెట్టతో కరెంట్ తయారీ ఏంటని తెలుసుకుని చాలా మంది ఇతని ఇంటికి చేరుకుంటున్నారట. ఇతని టాలెంట్ తెలుసుకుని చాలా మంది రామెహర్ ను అభినందిస్తున్నారు. కోడి రెట్టతో తయారు చేసిన ఇతడి ప్రతిభపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: ఐబొమ్మలో సినిమాలు చూస్తున్నారా.. అయితే మీకో షాకింగ్‌ న్యూస్‌