iDreamPost
android-app
ios-app

వీడియో: నడిరోడ్డుపై పోలీసుపై దాడి చేసిన యువకుడు!

వీడియో: నడిరోడ్డుపై పోలీసుపై దాడి చేసిన యువకుడు!

ఒకప్పుడు పోలీసులంటే జనానికి విపరీతమైన భయం ఉండేది.. ముఖ్యంగా పల్లెటూళ్లలో పోలీసులంటే చాలు బిక్కచచ్చిపోయేవారు జనం. మారుతున్న సమాజంతో పాటు జనాల ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చాయి. పోలీసులంటే భయం పోయింది. ఈ మధ్య కాలంలో పోలీసులపై ప్రజలు తిరగబడ్డం ఎక్కువైపోయింది. పోలీసులపై సాధారణ జనం దాడులు చేస్తున్న సంఘటనలు తరచుగా చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో కూడా ఓ సంఘటన చోటుచేసుకుంది.

ఈ ఘటనలో ఓ యువకుడు పోలీస్‌పై రెచ్చిపోయాడు. నడిరోడ్డులో అందరూ చూస్తుండగా అతడిపై దాడి చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం మధ్య ప్రదేశ్లోని, ఛత్తార్‌పూర్‌లో ఓ యువకుడు రోడ్డుపై బైకు మీద వెళుతూ ఉన్నాడు. ఓ చోట ఓ పోలీస్‌ అతడి బైకును ఆపాడు. హెల్మెట్‌ ఏది అని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్యా గొడవ మొదలైంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలీస్‌ యువకుడిపై చెయ్యి చేసుకున్నాడు. తనను కొట్టడంతో యువకుడి కోపం వచ్చింది. పోలీస్‌పై తిరగబడ్డాడు. ఇద్దరూ కొద్దిసేపు రోడ్డు మీద కొట్టుకున్నారు. ఎట్టకేలకు ఆ పోలీసే విజయం సాధించాడు.

ఆ యువకుడ్ని తనతో పాటు స్టేషన్‌కు తీసుకెళ్లిపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ఈ మధ్య కాలంలో పోలీసులంటే బొత్తిగా భయం లేకుండా పోయింది’’.. ‘‘ ఒకప్పుడు పోలీస్‌ అన్న మాట వింటనే భయపడిపోయేవారు. ఇప్పుడు ఆ భయం పోయింది’’..‘‘ ఈ ఘటనలో పోలీసుదే తప్పు ఉంది. ముందు అతడే ఆ వ్యక్తిపై దాడి చేశాడు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.