iDreamPost

కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి.. డీకే శివకుమార్ తో మంతనాలు?

Malla Reddy Meet DK Shivakumar: తెలంగాణలో బీఆర్ఎస్ కి మరో షాక్ తగలబోతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Malla Reddy Meet DK Shivakumar: తెలంగాణలో బీఆర్ఎస్ కి మరో షాక్ తగలబోతున్నట్లు సమాచారం. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి.. డీకే శివకుమార్ తో మంతనాలు?

ఇటీవల తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాలపై నమ్మకంతో తెలంగాణ ప్రజలు ఈసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. మహాలక్ష్మి పథకానికి విపరీతమైన ఆధరణ లభిస్తుంది. ఇదిలా ఉంటే.. మూడు నెలల కాంగ్రెస్ పాలనపై ప్రజలే కాదు.. కొంతమంది నాయకులకు కూడా మంచి నమ్మకం ఏర్పడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివవరాల్లోకి వెళితే..

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మాల్లారెడ్డి, ఆయన అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఓ హూటల్ లో భేటీ అయ్యారు. ఈ క్రమంలోనే రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్ మెంట్ కోరినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారని మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కి చెందిన కాలేజీ భవనాలు అధికారులు కూల్చి వేసిన సంగతి తెలిసిందే. అప్పుడే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి.

బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కార్మిక శాఖ మంత్రిగా మల్లారెడ్డి తనదైన దూకుడు ప్రదర్శించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలయ్యింది. కానీ మల్లారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. మల్లారెడ్డి అధికార పార్టీ కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. అదంతా తప్పుడు ప్రచారం అని.. తాను కాంగ్రెస్ లో చేరడం లేదని.. బీఆర్ఎస్ లోనే తుది వరకుకొనసాగుతా అంటూ స్పష్టం చేశారు. ఇంతలోనే పరిణామాలు శరవేతంగా మారిపోయాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకేస శివకుమార్ తో మల్లారెడ్డి, ఆయన అల్లుడు భేటీ కావడంతో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేగుతుంది. మరి ప్రియాంక గాంధీ సమక్షంలో మల్లారెడ్డి, కుమారుడు, అల్లుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. మరీ ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి