iDreamPost

మేజర్ అదరగొట్టాడు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా??

మేజర్ అదరగొట్టాడు.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా??

అడివి శేష్‌ హీరోగా,సయీ మంజ్రేకర్‌ హీరోయిన్ గా శశి కిరణ్‌ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మేజర్‌’. 26/11ముంబై దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్ని కృష్ణణ్‌ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా సినిమాగా ఓ రేంజ్ లో ప్రమోషన్స్ చేసి రిలీజ్ అయింది మేజర్. మహేశ్‌బాబు GMB ఎంటర్‌టైన్మెంట్, ఏ ప్లస్‌ ఏస్‌ మూవీస్‌తో కలిసి సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా ఈ సినిమాని నిర్మించగా జూన్‌ 3న థియేటర్లలో రిలీజ్ అయింది.

మేజర్ సినిమాకి ముందునుంచి పాజిటివ్ టాక్ ఉంది. దీంతో సినిమా కూడా అందర్నీ మెప్పించి మొదటి రోజు హిట్ టాక్ ని తెచ్చుకుంది. మొదటి రోజే ఈ సినిమా భారీ వసూళ్ళని రాబట్టింది. మేజర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.14.93 కోట్ల థియేట్రికల్‌ బిజినెస్‌ చేసింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే కనీసం 15 కోట్ల షేర్‌ రాబట్టాలి.

‘మేజర్‌’ ఫస్ట్ డే షేర్ కలెక్షన్స్‌ ఈ విధంగా ఉన్నాయి..

# నైజాం – రూ.1.75 కోట్లు

#సీడెడ్ – రూ.46 లక్షలు

#ఈస్ట్ – 24 లక్షలు

#వెస్ట్ – రూ.24 లక్షలు

#ఉత్త‌రాంధ్ర – రూ.51 లక్షలు

#గుంటూరు- 30 లక్షలు

#కృష్ణా – రూ.28లక్షలు

#నెల్లూరు – రూ.19లక్షలు

#రెస్టాఫ్‌ ఇండియా- 0.35కోట్లు

#ఓవర్సీస్‌-2.35 కోట్లు

మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజే రూ.7.12 కోట్లు షేర్ కలెక్షన్స్, 13 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్ వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఈ సినిమా త్వరగానే బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని, వారం రోజుల్లో కలెక్షన్స్ బాగా వస్తాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి