iDreamPost

పట్టపగలు సైకో వీరంగం.. ఒంటరిగా ఉన్న మహిళపై..!

పట్టపగలు సైకో వీరంగం.. ఒంటరిగా ఉన్న మహిళపై..!

ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు సైకోల్లా రెచ్చిపోతున్నారు. సమస్యను అర్థం చేసుకోకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తూ దారుణాలకు తెగబడుతున్నారు. అంతే కాకుండా పగోడి ప్రాణం తీసేందుకు కత్తులు నూరుతున్నారు. అచ్చం ఇలాగే రెచ్చిపోయిన ఓ సైకో.. పట్టగలు దారుణానికి ఒడిగట్టాడు. ఒంటరిగా ఉన్న ఓ మహిళ కత్తితో గొంతు కోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తీసుకెళ్లారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని ఇర్సులాపూరం. ఇదే గ్రామానికి చెందిన ఉండ్రాతి రాంబాబు, గండెల కళమ్మ శుక్రవారం ఓ వివాదంలో గొడవ పడ్డారు. దీంతో ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే రాంబాబు ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. ఎలాగైన కళమ్మను హత్య చేయాలని భావించాడు. ఇక ఇందులో భాగంగానే రాంబాబాబు పట్టపగలు ఒంటరిగా ఉన్న కళమ్మ గొంతు కోసి పరారయ్యాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి మహబూబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కళమ్మ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.

ఇది కూడా చదవండి: ఇలాంటి బతుకు నాకొద్దు! కంటతడి పెట్టిస్తున్నయువతి మరణం!