iDreamPost

చేతబడి చేశావంటూ భర్త టార్చర్! కానీ, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు!

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నావంటూ భర్త భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఈ దుర్మార్గుడు ఊహించని కిరాతకానికి ఒడిగట్టాడు.

మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చేతబడి చేస్తున్నావంటూ భర్త భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఈ దుర్మార్గుడు ఊహించని కిరాతకానికి ఒడిగట్టాడు.

చేతబడి చేశావంటూ భర్త టార్చర్! కానీ, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు!

ఈ మహిళ పేరు సువర్ణ, వయసు 32 ఏళ్లు. ఈమెకు గత 10 ఏళ్ల కిందట యాదగిరి అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలానికి ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు జన్మించారు. వీరి అలనా పాలన చూసుకుంటూ సంతోషంగానే ఉన్నారు. అయితే, గత కొంత కాలం నుంచి భర్త యాదగిరి భార్య సువర్ణపై అనుమానం పెంచుకున్నాడు. నా కుటుంబ సభ్యులపై చేతబడి చేయిస్తున్నావంటూ టార్చర్ చేయడం మొదలు పెట్టాడు. తట్టుకోలేని ఈ మహిళ తన పిల్లలను తీసుకుని మరో చోట కాపురం పెట్టింది. కట్ చేస్తే.. ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఇలా జరుగుతుందని మాత్రం సువర్ణ అస్సలు ఊహించలేదు. ఇంతకు ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా పెంట్లపల్లి మండలం జాటప్రోల్ గ్రామానికి చెందిన యాదగిరికి, కల్వకోల్ కు చెందిన సువర్ణ(32)కు 10 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు జన్మించారు. ఉపాధి నిమిత్తం ఈ దంపతులు గతంలో హైదరాబాద్ కు వెళ్లారు. అక్కడే ఓ చోట ఉంటూ కూలీ పనులకు వెళ్తూ జీవనాన్ని కొనసాగించారు. అలా కొంత కాలం పాటు ఈ దంపతులు ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగానే జీవించారు. కానీ, రాను రాను భర్త యాదగిరి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. నా తమ్ముడికి పెళ్లికి కాకుండా నా కుటుంబ సభ్యులపై చేతబడి చేయించావంటూ భార్యతో గొడవకు దిగేవాడు.

నాకేం తెలియదని భార్య సువర్ణ భర్తకు అనేక సార్లు అర్థమయ్యేలా వివరించే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో పెద్దల మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించి సర్ది చెప్పే ప్రయత్నం కూడా చేసింది. అలా ఇదే విషయంపై యాదగిరి భార్యతో తరుచు గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే భర్త పోరు భరించలేని సువర్ణ.. జాటప్రోల్ కు వచ్చింది. ఇక్కడే కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించేది. ఇదిలా ఉంటే.. శుక్రవారం యాదగిరి ఇంటికి వచ్చాడు. చేతబడి చేయిస్తున్నావంటూ భార్యతో మరోసారి గొడవకు దిగాడు. ఈ క్రమంలోనే ఇద్దరు గొడవ పడి వాగ్వాదానికి దిగారు.

ఇక క్షణికావేశంలో ఊగిపోయిన యాదగిరి.. ఇంట్లో ఉన్న సిలిండర్ తో భార్య తలపై బలంగా మోదాడు. ఇతడి దాడిలో సువర్ణ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇది గమనించిన మృతురాలి కూతురు వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అంతా పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు యాదగిరిని అరెస్ట్ చేశారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. చేతబడి చేశావంటూ భార్యతో గొడవ పడి చివరికి హత్య చేసిన యాదగిరి దారుణంపై మీ అభిప్రాయలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి