iDreamPost

ఏడాది తర్వాత OTTలోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

  • Author Soma Sekhar Published - 01:59 PM, Thu - 14 September 23
  • Author Soma Sekhar Published - 01:59 PM, Thu - 14 September 23
ఏడాది తర్వాత OTTలోకి వచ్చిన థ్రిల్లర్ మూవీ! స్ట్రీమింగ్ ఎందులో అంటే?

సాధారణంగా థియేటర్ లో విడుదలైన నెల, రెండు నెలలకు సినిమాలు ఓటీటీల్లోకి వస్తూ ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చేసరికి ఇంకాస్త టైమ్ పట్టొచ్చు. అది హీరో రేంజ్ ను బట్టి, సినిమా సక్సెస్ ను బట్టి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఓ సినిమా ఏకంగా సంవత్సరం తర్వాత ఓటీటీలోకి సైలెంగా వచ్చేసింది. ప్రముఖ నటుడు సత్యరాజ్ కొడుకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘మాయోన్’. గతేడాది జూన్ 24న తమిళంలో, జూలై 7న తెలుగులో విడుదల అయ్యింది. ఇక ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో సడెన్ గా సంవత్సరం తర్వాత ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఇంతకీ ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

‘మాయోన్’.. కట్టప్ప సత్యరాజ్ తనయుడు సిబిరాజ్ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సినిమా. ఈ మూవీకి కిషోర్ దర్శకత్వం వహించగా.. హీరోయిన్ గా తాన్య రవిచంద్రన్ నటించింది. పురాతన విగ్రహాల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈమూవీ గతేడాది జూన్ 24న తమిళంలో, జూలై 7న తెలుగులో రిలీజ్ అయ్యింది. విడుదలైన రెండు చోట్ల మిశ్రమ స్పందన దక్కించుకుంది ఈ చిత్రం. ఇక ఓటీటీలోకి వస్తుందని ఎదురుచూసిన ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. కానీ అనూహ్యంగా సంవత్సరం తర్వాత మాయోన్ ఓటీటీలో ప్రత్యక్షం అయ్యింది. సడన్ గా ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. దీంతో ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పురాతన విగ్రహాలను స్మగ్లింగ్ చేస్తూ.. తన పై అధికారి దేవరాజ్(హరీష్ పేరడీ)తో కలిసి విగ్రహాలను విదేశాలకు అమ్ముతూ ఉంటాడు అర్జున్(సిబిరాజ్). ఈ క్రమంలోనే 5 వేల సంవత్సరాల చరిత్రగల మాయోన్ ఆలయం, అందులో ఉన్న నిధి గురించి వీరికి తెలుస్తుంది. దీంతో ఆ నిధిని ఎలాగైనా దక్కించుకోవాలని చూస్తుంటారు. మరి ఇంతకీ ఆ నిధి దక్కించుకున్నారా? లేదా? అన్నదే మిగతా కథ. మరి ఈ కథ పూర్తిగా తెలియాలంటే ఈ మూవీని ఓటీటీలో చూడాల్సిందే!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి