iDreamPost
android-app
ios-app

బాలీవుడ్ కి సాయి పల్లవి! ఆ స్టార్ హీరో కుమారుడితో సినిమా!

  • Published Sep 14, 2023 | 11:38 AM Updated Updated Sep 14, 2023 | 11:38 AM
బాలీవుడ్ కి సాయి పల్లవి! ఆ స్టార్ హీరో కుమారుడితో సినిమా!

నేచురల్ బ్యూటీ నటి సాయి పల్లవి శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకుంది. తన సహజ నటనకు, నెమలి నాట్యమాడినట్లు చేసే తన డ్యాన్స్ లకు కుర్ర కారు ఫిదా అయిపోయారు. పాత్ర ఏదైన తన నటనతో జీవం పోయడం నటి సాయి పల్లవికి వెన్నతో పెట్టిన విద్య. చాలా సహజంగా నటిస్తూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది నటి సాయి పల్లవి. తన నటనతో మంత్ర ముగ్ధుల్ని చేస్తుంది సాయి పల్లవి. అయితే ఇప్పటి వరకు తెలుగు తమిళ్, మలయాళం సినిమాల్లో నటించిన ఆమె ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందంటూ ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ విషయమై జోరుగా ప్రచారం సాగుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ఎంత క్రేజ్ ఉందో మాటల్లో చెప్పలేం. లేడీ సూపర్ స్టార్ గా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఇంతటి క్రేజ్ ఉన్న నటి సాయి పల్లవి త్వరలో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు బాలీవుడ్ లో విస్తృత ప్రచారం సాగుతోంది. ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ తో కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. జునైద్ ఖాన్ తొలి చిత్రాన్ని తెరకెక్కనున్న ఆ సినిమాకి ఆమిర్‌ ఖాన్ కు సన్నిహితుడైన సునీల్‌ పాండే దర్శకత్వం వహిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒక వేళ ఇదే గనక జరిగితే బాలీవుడ్ లో సాయి పల్లవి అదరగొట్టడం ఖాయమంటూ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişgrandpashabetgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmarsbahis girişjojobet girişgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabetjojobetGrandpashabetjojobetgrandpashabet giriş