iDreamPost

రిలీజై రెండు రోజులు కాలేదు.. అప్పుడే OTT లోకి..

  • Author ajaykrishna Updated - 11:32 PM, Thu - 2 November 23
  • Author ajaykrishna Updated - 11:32 PM, Thu - 2 November 23
రిలీజై రెండు రోజులు కాలేదు.. అప్పుడే OTT లోకి..

ఈ మధ్యకాలంలో ఎలాంటి సినిమాలను ఆదరిస్తున్నారో ఒక్కోసారి ఎవరికి అర్ధం కావట్లేదు. ఎందుకంటే.. కొన్నిసార్లు ఫ్రెష్ కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తూ.. ఇంకొన్నిసార్లు పాత కంటెంట్ ని కొత్తగా ప్రెజెంట్ చేసినా చూస్తున్నారు. కానీ.. పూర్తిగా కొత్త ప్రయోగాలు చేస్తే మాత్రం అసలు చూడట్లేదు. అంటే.. సినిమాలు కూడా ఎంగేజింగ్ గా ఉండాలి అది తప్పదు. కనీసం ప్రయోగం చేద్దామనే వారికి కూడా ధైర్యం ఇచ్చే విధంగా ప్రేక్షకులు చూడట్లేదని కొందరి వాదన. అందులోనూ ఈ మధ్య జనాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లకు బాగా అలవాటు పడిపోయారు. ఎలాంటి సినిమాలైనా ఓటిటిలో చూసేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు.

థియేటర్స్ లో విడుదలైన సినిమాలను కూడా ఈ మధ్య డివైడ్ చేసేస్తున్నారు. ఫలానా మూవీ థియేట్రికల్ అని.. ఫలానా మూవీ ఓటిటి బెటర్ అని ముందే చెప్పేస్తున్నారు. సో.. అందువల్ల ఆయా సినిమాలకు లాభనష్టాల గురించి పక్కన పెడితే.. ఎంతోకొంత ఓటిటిల వల్ల ఎఫెక్ట్ అయితే పడుతుందని చెప్పవచ్చు. కట్ చేస్తే.. తాజాగా థియేటర్స్ లో విడుదలైన సినిమా ‘మామా మశ్చింద్ర’. సుధీర్ బాబు హీరోగా.. త్రిపాత్రభినయం చేశాడు. ఈ సినిమాలో మృనాలిని రవి, ఈషా రెబ్బ హీరోయిన్స్ గా నటించారు. నటుడు హర్షవర్ధన్ ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. కాగా.. అక్టోబర్ 6న సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది.

కట్ చేస్తే.. సినిమాకు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. సినిమాలో ఏ ఒక్క విషయం కూడా ఆకట్టుకునే విధంగా లేదని చూసిన ప్రేక్షకుల వాదన. దీంతో విడుదలైన రెండో రోజే.. సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ఓటిటి సంస్థ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించేసింది. మామా మశ్చింద్ర డిజిటల్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వారు సొంతం చేసుకున్నారు. కాగా.. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. కాబట్టి.. ఆలస్యం చేయకుండా ఓటిటి రిలీజ్ చేసేందుకు సిద్ధం అయిపోయింది. అక్టోబర్ 6న రిలీజైన ఈ సినిమాని.. దసరా సందర్బంగా అక్టోబర్ 20 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించింది. మరి మామా మశ్చింద్ర ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి