P Venkatesh
P Venkatesh
ఏపీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత విచారణ చేపట్టి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు బాబుకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇక బాబు అరెస్టు వ్యవహారంలో ఏపీ ప్రజలు చాకచక్యంగా వ్యవహరించారు. కుంభకోణంలో అరెస్టైన బాబుకు మద్దతిచ్చేది లేదంటూ ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. దీంతో టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో మునిగి పోయాయి. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడి పుత్ర రత్నం నారా లోకేశ్ సొంత రాష్ట్రంలో ఎలాగు మద్దతు లేదని తెలిసి తెలంగాణ నుంచి మద్దతు కోరాడు. తెలంగాణ ఐటీ మినిస్టర్ కేటీఆర్ కు ఫోన్ చేసి బాబు అరెస్టు కు మద్దుతు ఇవ్వాలని, తెలంగాణలో ధర్నాలకు, ర్యాలీలకు అనుమతి ఇవ్వాలని వేడుకున్నాడు. దీనిపై స్పందించిన కేటీఆర్ లోకేశ్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చాడు. ఇంతకీ మంత్రి కేటీఆర్ ఏమన్నాడంటే?
తాజాగా మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. లోకేశ్ ఫోన్ చేసి హైదరాబాద్ లో బాబు అరెస్టుకు నిరసనగా మద్దతు తెలుపుతూ ఐటీ ఉద్యోగులు, టీడీపీ శ్రేణులు నిర్వహిస్తున్న ర్యాలీలు, ధర్నాలకు మద్దతు ఇవ్వాలని కోరినట్లు మంత్రి కేటీఆర్ వెల్లడించాడు. దీనికి సమాధానంగా అసలు బాబు అరెస్టుకు తెలంగాణకు సంబంధం ఏముంది. బాబు అరెస్టు రెండు పార్టీలకు సంబంధించిన సమస్య. తెలంగాణలో ఏవిధమైన ర్యాలీలకు అనుమతివ్వమని చెప్పినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
శాంతి భద్రతలే మాకు ముఖ్యమని, తెలంగాణ ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని మంత్రి కేటీఆర్ లోకేశ్ ను ప్రశ్నించారు. జగన్, పవన్ లోకేశ్ నాకు మంచి మిత్రులే. కానీ మీ సమస్యను మీ దగ్గరే తేల్చుకోండి, రాజమండ్రిలో భూమి బద్దలయ్యేలా ధర్నాలు చేసుకోండి, తెలంగాణలో మాత్రం ఎలాంటి నిరసనలకు తావు లేదు అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రశాంతంగా ఉన్న ఐటీ రంగంలో అలజడి సృష్టించొద్దని హెచ్చరించారు. అనుమతులు లేకుండా ఎవరైనా ర్యాలీలు, నిరసనలకు పాల్పడితే చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.