iDreamPost
android-app
ios-app

లోకేష్ మాస్టర్ మైండ్.. ప్రభాస్ తో క్లైమాక్స్! మామూలుగా లేదుగా..

  • Author ajaykrishna Updated - 09:18 PM, Sun - 8 October 23
  • Author ajaykrishna Updated - 09:18 PM, Sun - 8 October 23
లోకేష్ మాస్టర్ మైండ్.. ప్రభాస్ తో క్లైమాక్స్! మామూలుగా లేదుగా..

లోకేష్ కనగరాజ్.. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో టోటల్ సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే గానీ అతని సినిమాల ఇంపాక్ట్ మాత్రం ప్రేక్షకులపై నెక్స్ట్ లెవెల్ లో పడింది. ఖైదీ, విక్రమ్ మూవీస్ తో తనకంటూ ప్రత్యేక సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో మూవీని రిలీజ్ కి రెడీ చేశాడు. దసరా సందర్బంగా అక్టోబర్ 19న లియో పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాగా.. ప్రస్తుతం అనిరుధ్ సాంగ్స్ తో పాటు ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ట్రైలర్ పై అభిప్రాయాలు అటు ఇటుగా ఉన్నా.. సినిమా గురించి ట్రేడ్ వర్గాల అంచనాలు వేరేలా ఉన్నాయి.

కట్ చేస్తే.. లియో సినిమా సినిమాటిక్ యూనివర్స్ లో భాగం అవుతుందో లేదో తెలియదు. కానీ.. సినిమా థియేటర్ కి వచ్చి చూసి.. మీరే తెలుసుకుంటే బాగుంటుందని లోకేష్ చెప్పుకుంటూ వస్తున్నాడు. అయితే.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటికే స్టార్ హీరోలు కమల్ హాసన్, కార్తీ, సూర్య, ఫాహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ భాగం అయ్యారు. ఇప్పుడు లియోతో విజయ్ కూడా భాగం కానున్నట్లు టాక్ నడుస్తుంది. కానీ.. సినిమా హాలీవుడ్ కి రీమేక్ అని వినికిడి. ఇదిలా ఉండగా.. లోకేష్ గతంలో తాను విక్రమ్ 2, ఖైదీ 2, రోలెక్స్ క్యారెక్టర్ పై ఓ సినిమా.. అలాగే డార్లింగ్ ప్రభాస్ తో కూడా ఓ సినిమా మైండ్ లో ఉందని చెప్పాడు.

ఇక ప్రభాస్ తో లోకేష్ సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని తెలిసి.. ఇటు డార్లింగ్ ప్లాన్స్ లో ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పటికే కాంబినేషన్ లో సినిమా ఎప్పుడెప్పుడు అనౌన్స్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు. కానీ.. ప్రభాస్ కంటే ముందు లోకేష్.. ఖైదీ, విక్రమ్ లకు సీక్వెల్స్ తో పాటు రోలెక్స్ పై సపరేట్ గా ఓ మూవీ ముందుగా చేయనున్నాడు. సో.. ఇవి అయ్యాకే ప్రభాస్ తో తీసే ఛాన్స్ ఉంటుంది. లేదా మధ్యలో ప్రభాస్ ని కలుపుకున్నా చెప్పలేం. అయితే.. తాజా సమాచారం ప్రకారం.. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ప్రభాస్ కూడా భాగం అవుతాడని, ప్రభాస్ తోనే LCU ఎండ్ అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఇందులో నిజమెంత అనేది పక్కన పెడితే.. ఆ టైమ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇక లోకేష్, ప్రభాస్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

jojobet girişJojobet GirişBetcioivermectin tabletPokerklasPokerklasPusulabetmeritbetCasibom GirişmeritbetpokerklasKulisbet girişmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişJojobet GirişHoliganbetMarsbahis