డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.. ప్రస్తుతం ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతున్న పేరు. ఖైదీ, మాస్టర్, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్న లోకేష్.. ఇప్పుడు దళపతి విజయ్ తో లియో సినిమాని రిలీజ్ కి రెడీ చేశాడు. దసరా పండుగ సందర్బంగా అక్టోబర్ 19న లియో రిలీజ్ అవుతోంది. విజయ్ కెరీర్ ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా లియో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా.. ఖైదీ, విక్రమ్ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేసిన లోకేష్.. ఇప్పుడు దళపతి విజయ్ ని కూడా LCU లో భాగం చేస్తాడా లేదా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఓవైపు లియో LCU లో భాగమే అని టాక్ నడుస్తోంది.
కట్ చేస్తే.. లియో మూవీ స్టార్టింగ్ లో పది నిముషాలు అసలు మిస్ అవ్వకూడదు అని లోకేష్ ఆడియన్స్ కి హింట్ ఇచ్చాడు. సో.. గతంలో విక్రమ్ రిలీజ్ టైమ్ లో ఖైదీ చూసి రమ్మని లోకేష్ చెప్పాడు. ఇప్పుడు లియోకి కూడా మొదటి పది నిముషాలు మిస్ కాకూడదు అనేసరికి.. అందరిలో ఆసక్తి రెట్టింపు అయిపోయింది. దీంతో ఒకవేళ LCU కి లియో లింక్ అయ్యుంటే.. ఎలా.. ఎక్కడ లింక్ చేశాడు? అనేది ఇంటరెస్టింగ్ గా మారింది. కాగా.. ఇందులో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా.. లోకేష్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు పలుమార్లు మీడియా ముఖంగానే చెప్పేశాడు.
దీంతో లోకేష్.. దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ఎప్పుడెప్పుడు అనే ఉత్సాహం ఫ్యాన్స్ అందరిలో కనిపిస్తుంది. ఎందుకంటే.. ఖైదీ, విక్రమ్, మాస్టర్ లతో లోకేష్ సంపాదించుకున్న జెన్యూన్ ఫ్యాన్ బేస్ అది. కట్ చేస్తే.. ఇప్పుడు లియో ప్రమోషన్స్ లో కూడా లోకేష్ ప్రభాస్ తో సినిమా గురించి ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ప్రభాస్ ని కూడా LCU లో భాగం చేస్తాడని అందరు అనుకున్నారు. కానీ.. లోకేష్ ఫుల్ క్లారిటీ ఇచ్చేశాడు. అదేంటంటే.. “ప్రభాస్ తో నా సినిమా చాలా యూనిక్ గా ఉంటుంది. నేను ఇప్పటిదాకా తీసిన, తీయబోయే సినిమాలకు అసలు కనెక్షన్ ఉండదు. అది పూర్తిగా సోలో ఫిల్మ్. వేరే మూవీస్ మిక్సింగ్ కూడా లేకుండా ఉండబోతుంది.” అని చెప్పాడు. దీంతో ప్రభాస్ LCU లో భాగం కాదని క్లారిటీ వచ్చినట్లే. మరి ప్రభాస్ – లోకేష్ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.