iDreamPost

ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం.. యూట్యూబర్ నాని వీడియో!

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్ద పెద్ద శబ్ధాలతో బోట్లు తగలబడిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నిన్న రాత్రి 10:30 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి పెద్ద పెద్ద శబ్ధాలతో బోట్లు తగలబడిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం.. యూట్యూబర్ నాని వీడియో!

విశాఖలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫిషింగ్ హార్బర్ లో నిన్న రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించడంతో దాదాపు 60 కి పైగా పడవలు కాలి బూడిదయ్యాయి. కోట్లలో నష్టం వాటిల్లినట్లు వార్తలు వస్తున్నాయి. బోట్లతో పాటు అందులో ఉన్న మత్స్య సంపద కూడా కాలిపోవడంతో బాాధితులు లబోదిబో అంటున్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం మత్స్యకారులకు తీవ్ర నష్టంతో పాటు.. కన్నీళ్లు మిగిల్చాయి. ప్రమాదానికి గురైన బోట్లలో ఐదు నుంచి ఆరు లక్ష విలువైన చేపలు ఉన్నట్లు మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి అగ్నిమాకప సిబ్బందితో వెళ్లి ఎంతో శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం వాటిల్లకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనకులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ ప్రమాదానికి కారణం ఓ యూట్యూబర్ అని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

విశాఖ ఫిషింగ్ హార్బర్ లోని ఒకటో నెంబర్ జెట్టీ వద్ద అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల్లోనే ఇతర బోట్లకు మంటలు వ్యాపించడంతో దాదాపు 60 కి పైగా పడవలు అంటుకున్నాయి. ఇది గమనించిన మత్స్యకారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే పోలీసులు, అగ్ని మాపక సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకు వచ్చారు. సీఎం జగన్ ఆదేశాల మేరకు మంత్రి సిదిరి అప్పల రాజు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలపై ఆరాతీస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఘటనలో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి కారణం ఓ యూట్యూబర్బ అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఫిషింగ్ హార్బర్‌లో పార్టీ ఏర్పాటు చేయడం.. అక్కడ మద్యం మత్తులో గొడవల చెలరేగి ఈ ప్రమాదం జరిగి ఉండవొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు యూట్యూబర్ పై కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పరారీలో ఉన్న యూట్యూబర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం ఆ యూట్యూబర్ ని టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. లోకల్ బాయ్ నాని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అగ్ని ప్రమాదం జరిగిన ఫిషింగ్ హార్బర్ వద్ద లైవ్ వీడియో తీస్తూ అక్కడి పరిస్థితుల గురించి కళ్లకు కట్టినట్లు చూపించాడు. తన జీవితంలో ఇలాంటి దారుణమైన ఘటన ఎప్పుడూ చూడలేదని.. వందకు పైగా బోట్ల కాలిపోయి ఉంటాయని… అక్కడ ఫైరింజన్ సిబ్బందితో మాట్లాడుతూ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నాడు. బోట్ ఓనర్లు.. కళ్ల ముందు కనిపిస్తున్న దారుణం చూసి తట్టుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కొంతమంది ఓనర్లు ప్రాణాలకు తెగించి తమ బోట్లను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. డబ్బు, బంగారం కుదువపెట్టి బోట్లు కొంటే ఇప్పుడు కళ్ల ముందు కాలి బూడిద అయ్యాయి.. అందులో ఉన్న చేపలు కాలిపోయాయి. కోట్లలో నష్టం వాటిల్లిందని కన్నీరు పెట్టుకున్నాడు. మా హార్బర్ లో బోట్లు కాలిపోతున్నాయి.. మా కన్నీళ్లు చూడండి.. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం లోకల్ నాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి