iDreamPost

లింగాలో సైడ్ క్యారెక్టర్ చేసిన ఈ నటిని గుర్తు పట్టారా? ఇప్పుడు రూ.300 కోట్ల హీరోయిన్!

స్మాల్ అండ్ ఐడెండిటీ రోల్స్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా మెప్పించి.. స్టార్ స్టేటస్ పొందారు చాలా మంది నటీమణులు. ఈ ఫోటోలో హ్యాండ్ సిగ్నల్ కనిపిస్తున్న బ్యూటీ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

స్మాల్ అండ్ ఐడెండిటీ రోల్స్ చేసి.. ఆ తర్వాత హీరోయిన్ గా మెప్పించి.. స్టార్ స్టేటస్ పొందారు చాలా మంది నటీమణులు. ఈ ఫోటోలో హ్యాండ్ సిగ్నల్ కనిపిస్తున్న బ్యూటీ కూడా ఇదే జాబితాలోకి వస్తుంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

లింగాలో సైడ్ క్యారెక్టర్ చేసిన ఈ నటిని గుర్తు పట్టారా? ఇప్పుడు రూ.300 కోట్ల హీరోయిన్!

హీరోయిన్లలో చాలా మంది సైడ్ క్యారెక్టర్లలో మెరిసిన వారే. చిన్న చితకా రోల్స్ చేస్తూ నటిగా నిరూపించుకుంటూ.. ఆ తర్వాత మెయిన్ లీడ్ ఆఫర్లను అందిపుచ్చుకుంటారు. త్రిష, అనసూయ, సాయి పల్లవి, బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య వరకు చిన్న రోల్స్ చేసిన వారే. అలా ప్రత్యక్షమై.. ఇలా వెళ్లిపోతుంటారు. జోడి సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ క్యారెక్టర్‌లో మెరిసింది త్రిష. నాగ మూవీలో అనసూయ భరద్వాజ కనిపిస్తోంది. అలాగే తమిళ పిక్చర్ రక్షకుడులో కంగనా రనౌత్ సోదరిగా నటించింది సాయి పల్లవి. ఇక వైష్ణవి చైతన్య యూట్యూబర్‌గా కెరీర్ స్టార్ చేసి వరుడు కావలెను, టక్ జగదీష్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రల్లో కనిపించింది. ఇప్పడు ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్నే.. కానీ తొలి నాళ్లలో గుర్తింపు లేని పాత్రలో నటించిందని తెలుసా..

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటిని గుర్తు పట్టారా.. సోనాక్షి సిన్హా అని ఠక్కున చెప్పేస్తారు. ఇందులో హ్యాండ్ కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా.. ఇప్పుడో స్టార్ హీరోయిన్. ఒక్క మూవీతోనే ఆల్ ఓవర్ ఇండియా ఆమె పేరు మారు మోగిపోయింది. కానీ తొలి నాళ్లలో గుర్తంపు లేని పాత్రలు చేసింది. ఒకటి కాదు రెండు కాదు.. సుమారు ఐదు సినిమాల వరకు సైడ్ క్యారెక్టర్లతో మెరిసింది. అందులో ఇది కూడా ఒకటి.  లింగ సినిమాలోని పిక్ ఇది. రజనీకాంత్, అనుష్క, సోనాలి సిన్హా, జగపతి బాబు ముఖ్య పాత్రలు పోషించారు. 2014లో విడుదలైన ఈ మూవీలో ఆమె చిన్న క్యారెక్టర్ చేసింది.  ఇంతకు ఆ బ్యూటీ ఎవరంటే.. హనుమాన్ హీరోయిన్ అమృతా అయ్యర్. ఈ సంక్రాంతికి రిలీజైన ఈ పిక్చర్ రూ. 300 కోట్లను కొల్లగొట్టిన సంగతి విదితమే.

పద్మ వ్యూహం అనే మలయాళ చిత్రంలో చిన్న క్యారెక్టర్ చేసింది అమృత . ఆ తర్వాత తెనాలి రామన్, లింగా, పోకిరీ రాజా, తేరీ వంటి బిగ్ హీరోస్ మూవీల్లోనూ గుర్తింపు లేని పాత్రలు చేసింది. పదై వీరన్ సినిమాతో హీరోయిన్‌గా అవకాశాన్ని అందిపుచ్చుకున్న అమృతా, కాళీ, బిగిల్ వంటి చిత్రాల్లో మెరిసింది. తెలుగులో రెడ్ చిత్రంలో ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ఆమె వెల్ నోటెడ్ అయ్యింది మాత్రం ప్రదీప్ హీరోగా వచ్చిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలాతోనే. అందులో ‘నీలి నీలి ఆకాశం’ సాంగ్‌లో అమ్మాయి గారు అనే డైలాగ్‌తోనే ఫేమస్ అయ్యింది ఈ చెన్నై చిన్నది. ఆ తర్వాత లిఫ్ట్ అనే తమిళ చిత్రంలో చేసింది. శ్రీవిష్ణు అర్జున పాల్గుణ కూడా చేసింది. కానీ ఆమెను పాన్ ఇండియాకు పరిచయం చేసిన మూవీ మాత్రం హనుమాన్. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఒకప్పుడు డీ గ్లామర్ రోల్, ఐడెంటిటీ లేని రోల్స్ చేసిన ఈ నటి.. ఇప్పుడు ఈ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయ్యింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి