iDreamPost

ఇదేందయ్యా ఇది.. 35 వేలు పలికిన నిమ్మకాయ ధర.. అసలు కారణం ఏంటంటే?

నిమ్మకాయ ధర మహా అయితే ఓ పది రూపాయల లోపే ఉంటుంది. కానీ అక్కడ మాత్రం వేల రూపాయల ధర పలికి షాక్ ఇచ్చింది. అసలు నిమ్మకాయ ధర అంత పలకడానికి గల కారణం ఏంటంటే?

నిమ్మకాయ ధర మహా అయితే ఓ పది రూపాయల లోపే ఉంటుంది. కానీ అక్కడ మాత్రం వేల రూపాయల ధర పలికి షాక్ ఇచ్చింది. అసలు నిమ్మకాయ ధర అంత పలకడానికి గల కారణం ఏంటంటే?

ఇదేందయ్యా ఇది.. 35 వేలు పలికిన నిమ్మకాయ ధర.. అసలు కారణం ఏంటంటే?

వేసవి వచ్చిందంటే చాలు నిమ్మకాయలకు డిమాండ్ పెరిగిపోతుంటుంది. ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మకాయ సోడా, ఇళ్లల్లో షరబత్ చేసుకుని కూల్ కూల్ గా తాగుతుంటారు. నిమ్మకాయలో ఉండే సీ విటమిన్ శరీర ఆరోగ్యానికి మంచి చేయడంతో ఎక్కువ మొత్తంలో వాడేస్తుంటారు. అయితే నిమ్మకాయను తినడానికే కాకుండా పలు రకాల పూజల్లో కూడా వినియోగిస్తుంటారు. అయితే నిమ్మకాయల ధరలు సీజన్ బట్టి కాస్త ధరలు పెరుగుతుంటాయి. మహా అయితే ఒక్క నిమ్మకాయ రూ. 5 నుంచి రూ. 10 వరకు ఉంటుంది. అంతే గాని అక్కడ మాత్రం నిమ్మకాయ ధర రూ. 35 వేలు పలికింది. ఇది మీకు వినడానికి విడ్డూరంగా ఉన్న వాస్తవంగా జరిగింది మాత్రం అదే. అసలు కారణం ఏంటంటే?

తమిళనాడులో నిమ్మకాయ ధర షాకిచ్చింది. వేలంలో రికార్డ్ ధర పలికింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహా శివరాత్రి సందర్భంగా ఈరోడ్‌ జిల్లా శివగిరి గ్రామం సమీపాన ఉన్న ఓ ఆలయంలో నిమ్మ, ఇతర ఫలాలను శివుడికి నైవేద్యంగా సమర్పించారు. ఆ తర్వాత ఆ ఫలాలను వేలం వేశారు. సాధారణంగా ఆలయాల్లో చీరలు, భగవంతునికి సమర్పించిన వస్త్రాలు వేలం నిర్వహిస్తుంటారు ఆలయ అధికారులు. ఇక్కడ కూడా అదే విధంగా శివుడికి సమర్పించిన నిమ్మకాయను వేలం వేయగా రూ. 35 వేల ధర పలికింది.

ఈ వేలంలో దాదాపు 15 మంది భక్తులు పాల్గొన్నారు. భగవంతుని ప్రసాదంగా భావించే ఆ నిమ్మకాయకు వేలంలో భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే నిమ్మకాయ ధర రూ. 35 వేలు పలికింది. ఈరోడ్‌కు చెందిన ఓ భక్తుడు రూ.35 వేలకు నిమ్మకాయను వేలంలో దక్కించుకున్నట్టు ఆలయ వర్గాలు తెలిపాయి. వేలం అనంతరం ఆలయ పూజారి పూజ నిర్వహించి ఆ భక్తుడికి అందజేశారు. ఈ నిమ్మకాయను దక్కించుకున్న వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి